Future City: ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే గ్రీన్ బిల్డింగ్ రికార్డు సాధించిన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పర్యావరణ హిత నిర్మాణంగా గుర్తింపు పొందిన ఈ భవనంలో సౌరశక్తి వినియోగం, వాననీటి సంరక్షణ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) నూతన కార్యాలయాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. విశేషం ఏమిటంటే, ఈ భవనం ప్రారంభానికి ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గ్రీన్ బిల్డింగ్ గుర్తింపును పొందింది. పర్యావరణ హిత నిర్మాణ ప్రమాణాలను పాటించినందుకు ఈ గుర్తింపు లభించింది. భవన నిర్మాణంలో పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను వినియోగించడం, వాన నీటి సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలు దీనికి దోహదపడ్డాయి. ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో 15 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్, రెండు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, సేంద్రియ వ్యర్థాలను వినియోగించుకునేందుకు బయో డైజెస్టర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నెట్ జీరో బిల్డింగ్‌గా ఎంపికైన ఈ కార్యాలయం హైదరాబాద్‌ను గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ విజన్‌పై వివరించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్ వార్నింగ్..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్ కు వెళ్లి తిరిగి రాని యువతి.. ఇంకా మిస్టరీగానే మిస్సింగ్ కేసు..
Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్.. ఖరీదైన ప్రొడక్ట్స్ కాదట.
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

