AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

Phani CH
|

Updated on: Jun 10, 2026 | 11:14 AM

Share

తన పొడవైన, ఒత్తయిన జుట్టు రహస్యాన్ని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వెల్లడించారు. ఖరీదైన హెయిర్ ట్రీట్‌మెంట్లు కాదని, తన అత్తగారు తయారు చేసే ఉల్లిపాయ, ఉసిరి, అవకాడోతో కూడిన సహజ హెయిర్ ఆయిల్‌నే ఉపయోగిస్తానని చెప్పారు. ఈ పదార్థాలు జుట్టు కుదుళ్లను బలపరచి, రాలడాన్ని తగ్గించి, సహజ మెరుపును అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

తన పొడవైన, ఒత్తయిన మెరిసే జుట్టుకి సంబంధించిన ఫోటోలను బాలీవుడ్‌ నటి, కత్రినా కైఫ్‌ తరచూ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తుంటారు. ఇటీవల తన భర్త, నటుడు విక్కీ కౌశల్‌ పుట్టిన రోజు సందర్భంగా టూర్‌కి వెళ్లినప్పుడు కూడా ఆమె తన ఫోటోలను షేర్‌ చేశారు. ఆ ఫోటోల్లో ఎప్పటిలాగే.. కత్రినా ఆకర్షణీయమైన జుట్టు అందరినీ ఆకట్టుకుంది. మీ జుట్టు అంత ఒత్తుగా, పొడవుగా ఎలా అంటూనే.. మా హెయిర్‌ కూడా మీలా ఉండాలంటే ఏం చేయాలో కాస్త చెప్పండి అంటూ పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో తన పొడవైన, ఒత్తైన జుట్టు సీక్రెట్‌ ఖరీదైన సెలూన్ ట్రీట్‌మెంట్ కానీ విలాసవంతమైన హెయిర్ ప్రొడక్ట్ కాదని.. ఇంట్లో తన అత్తగారు వీణా కౌశల్‌ తయారు చేసిన నేచురల్‌ హెయిర్‌ ఆయిల్‌ అని కత్రినానే స్వయంగా అసలు విషయం చెప్పేసారు. మరి ఆ హెయిర్‌ ఆయిల్‌ ఏంటి? దానిని ఎలా తయారు చేస్తారు? అందులో ఉపయోగించే పదార్థాల స్పెషాలిటీ ఏంటో చెప్పారు. తన అత్తగారు ఉ‍ల్లిపాయ, ఉసిరి, అవకాడోతో పాటు మరికొన్ని పదార్థాలతో నూనెను తయారు చేస్తారట. ఆ ఆయిల్‌ని జుట్టుకు ముందుకు బాగా మర్దన చేస్తానని, తన కురుల పోషణకు అది చాలా అద్భుతంగా పనిచేస్తుందనీ కత్రినా అన్నారు. ఉసిరికాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు సంరక్షణకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లను బలపరుస్తుంది. అంతేకాకుండా తొందరగా తెల్లబడకుండా మంచి నిగారింపును ఇస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుంది. ఉల్లిపాయ రసంలోని సల్ఫర్‌ కెరాటిన్‌ జుట్టును బలంగా, ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ల కారణంగా జుట్టుకు లోతైన పోషణ, తేమ లభిస్తుంది సహజ కండిషనర్‌గా పని చేసి చుండ్రు సమస్యను తగ్గించి జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. జుట్టు నల్లగా పొడవుగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటారు. విటమిన్‌ బీ12, ఐరన్‌, విటమిన్‌ సీ లోపం వల్ల జుట్టు త్వరగా తెల్లగా అవుతుంది. కాబట్టి ఉసిరికాయ, కరివేపాకు, నల్ల నువ్వులు, పాలకూర, మునగాకు వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు, పప్పుధాన్యాలు తీసుకోవడం ద్వారా కూడా జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. అలాగే కెమికల్‌ షాంపూలకు బదులు ఉసిరి, శీకాయ, మైల్డ్‌ షాంపూలను ఉపయోగించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో

సంపదలో అంబానీనే దాటేసిన టిక్‌టాక్‌ ఫౌండర్‌

మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?

రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్‌కు కొత్త సిస్టమ్‌..!

Follow Us