సంపదలో అంబానీనే దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్
టిక్‌టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరడంతో ముకేశ్ అంబానీని అధిగమించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బైట్‌డ్యాన్స్, టిక్‌టాక్, డౌబావో ఏఐ విజయాలతో ఆయన సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
ఒకప్పుడు చమురు, రియల్ ఎస్టేట్ రంగాలు కుబేరులను సృష్టిస్తే.. ఈ ఏఐ యుగంలో కేవలం ఒక కోడింగ్ అల్గారిథమ్‌తో ప్రపంచాన్నే శాసించవచ్చని ఝాంగ్ యిమింగ్ నిరూపించారు. సంపదలో రిలయన్స్ ముకేశ్ అంబానీని చైనాకు చెందిన ‘టిక్‌టాక్’ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. జాంగ్ నికర ఆస్తి విలువ 92.8 బిలియన్ డాలర్లు. దాంతో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోయారు. ఝాంగ్ ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా, చైనాలోనే నంబర్-1 కుబేరుడిగా అవతరించారు. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ 117.4 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. చైనాలోని ఫుజియాన్ ప్రాంతంలో జన్మించిన 43 ఏళ్ల ఝాంగ్ యిమింగ్.. నాంకై విశ్వవిద్యాలయం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆరంభంలో మైక్రోసాఫ్ట్ లో పనిచేసిన ఆయన 2012లో ఓ చిన్న అపార్ట్మెంట్ రూమ్ నుంచి ‘బైట్‌డ్యాన్స్’ కంపెనీని ప్రారంభించారు. అల్గారిథమ్స్ ఆధారంగా యూజర్లకు నచ్చిన కంటెంట్‌ను అందించే ‘టౌటియావో’ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించారు. ఆ తర్వాత ఆయన తెచ్చిన షార్ట్ వీడియో యాప్ ‘టిక్‌టాక్’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా యూజర్లతో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బైట్‌డ్యాన్స్ రూపొందించిన ‘దౌబావో’ అనే ఏఐ చాట్‌బాట్ చైనాలో బాగా పాపులరైంది. డౌబావోకు 300 మిలియన్ల మంది నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. అమెరికాలో టిక్‌టాక్ పై కొన్నేళ్లుగా ఉన్న అనిశ్చితి ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్‌డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్‌ను బ్లూమ్‌బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి. బ్లాక్‌రాక్, ఫిడిలిటీ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బైట్‌డ్యాన్స్ విలువను భారీగా పెంచడంతో ఝాంగ్ సంపద ఒకేసారి 24 బిలియన్ డాలర్లు పెరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్‌కు కొత్త సిస్టమ్..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

