రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్‌కు కొత్త సిస్టమ్..!
ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఆగస్టు నుంచి అత్యాధునిక రిజర్వేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకురానుంది. కొత్త సిస్టమ్‌తో లక్షలాది టికెట్లు నిమిషాల్లోనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సర్వర్ సమస్యలు తగ్గడంతో పాటు బుకింగ్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అలాగే ఏఐ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ అంచనా సాధనం కూడా ప్రయాణికులకు ఉపయోగకరంగా మారుతోంది.
1986 నుంచీ అమల్లో ఉన్న వ్యవస్థ స్థానంలో.. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌ను ఆగస్ట్ నుంచి అమల్లోకి తీసుకురానుంది ఇండియన్ రైల్వే. ఈ మార్పుతో.. ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం మరింత సులభం కానుంది. ఈ కొత్త బుకింగ్ విధానంలో నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సిస్టమ్‌కు మారే ప్రక్రియపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సాంకేతిక మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ 2002 సంవత్సరంలో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి కౌంటర్ల కంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైల్వే టికెట్లలో దాదాపు 88 శాతం బుకింగ్స్ కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ భారీ డిమాండ్‌కు అనుగుణంగానే పాత వ్యవస్థను అధునాతన సాంకేతికతతో రైల్వే మారుస్తోంది. రైల్వే శాఖ డిజిటల్ విప్లవంలో భాగంగా గత ఏడాది జూలైలో ప్రారంభించిన ‘రైల్ వన్’ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాదిలోపే ఈ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లను దాటేసింది. ఈ ఒక్క యాప్ ద్వారానే టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రైలు లైవ్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ సమాచారం, ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. కొత్త సిస్టమ్‌తోపాటు ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ టూల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా..? అనే అవకాశాలను ఈ టూల్ ముందుగానే అంచనా వేస్తుంది. దీని అంచనా కచ్చితత్వం గతంలో 53 శాతంగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 94 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్లాన్లను మరింత సులభంగా మార్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

