AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!

మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!

Phani CH
|

Updated on: Jun 10, 2026 | 10:16 AM

Share

మొక్కలు నిశ్శబ్దంగా కనిపించినా, ప్రమాదం వచ్చినప్పుడు ప్రత్యేక రసాయన సంకేతాల ద్వారా సహాయం కోరుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పురుగుల దాడి సమయంలో అవి గాలిలో సంకేతాలను విడుదల చేసి ఇతర మొక్కలను హెచ్చరించడమే కాకుండా, శత్రువులను వేటాడే జీవులను కూడా ఆకర్షిస్తాయి. ఈ అద్భుత రక్షణ వ్యవస్థ వ్యవసాయంలో సహజసిద్ధమైన పురుగు నియంత్రణకు దోహదపడనుంది.

మొక్కలు మాట్లాడవు… కానీ సంకేతాలు పంపుతాయి. అవి పరుగెత్తలేవు… కానీ సహాయం కోరతాయి. అవి చేతులు ఎత్తి పోరాడలేవు… కానీ తమ శత్రువులను ఎదుర్కొంటాయి. ప్రకృతి ఎంత అద్భుతమో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మొక్కలు కూడా సహాయం కోసం అరుస్తాయి. శాస్త్రవేత్తలు ఈ షాకింగ్ నిజాన్ని కనుగొన్నారు ! నిజానికి మొక్కలు కనిపించేంత అమాయకులేం కావు. కోట్లాది సంవత్సరాలుగా అవి తమను తాము రక్షించుకునేందుకు ముళ్లు, విషపూరిత ఆకులు, చేదు రసాలు వంటి అద్భుత వ్యూహాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఒక పురుగు… మొక్క ఆకులను తినడం ప్రారంభించిన క్షణం నుంచే ఆ మొక్కలో అలారం మోగుతుంది. మనకు వినిపించకపోయినా, కనిపించకపోయినా మొక్క తన చుట్టూ ప్రత్యేక రసాయన సంకేతాలను విడుదల చేస్తుంది. ఇవి గాలిలో వ్యాపించి సమీపంలోని ఇతర మొక్కలకు ప్రమాదం గురించి హెచ్చరిక పంపుతాయి. అంతేకాదు, కొన్ని మొక్కలు మరింత తెలివిగా వ్యవహరిస్తాయి. మొక్కను తినే పురుగుపై దాడి చేయడానికి మరో జీవిని పిలుస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, మొక్క నేరుగా పోరాడలేకపోయినా తన శత్రువుపై “సహాయక దళాలను” పంపిస్తుంది. ఉదాహరణకు, కొన్ని చిక్కుడు జాతి మొక్కలను గొంగళిపురుగులు తినడం ప్రారంభిస్తే, ఆ మొక్క గాలిలో ప్రత్యేక సంకేతాలను విడుదల చేస్తుంది. ఆ సంకేతాలను గుర్తించిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ సంకేతాలు.. కందిరీగలను సాయానికి పిలుస్తున్నాయని వారి పరిశోధనలో తేలింది. కందిరీగలు అక్కడికి చేరుకుని గొంగళి పురుగులను వేటాడి మొక్కలను కాపాడతాయి. దీంతో మొక్కకు కలిగే నష్టం తగ్గుతుంది. అందుకే ఇకపై ఒక సాధారణ మొక్కను చూసినప్పుడు అది కేవలం నిశ్శబ్దంగా నిలబడి ఉందని అనుకోవద్దు. దాని లోపల మనకు తెలియని ఎన్నో రహస్యాలు, తెలివైన రక్షణ వ్యవస్థలు పనిచేస్తూ ఉండొచ్చు! మెక్సికోలోని ఒక్సాకాలో నిర్వహించిన క్షేత్రస్థాయి ప్రయోగాల్లో ఈ విషయం స్పష్టంగా రుజువైంది. ఈ ఆవిష్కరణ వ్యవసాయ రంగంలో పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, సహజ పద్ధతుల్లో పంటలను కాపాడుకోవడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?

రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్‌కు కొత్త సిస్టమ్‌..!

తిడుతూ.. చితకబాదుతూ.. క్యాబ్ డైవర్ పై కాట్రాజ్‌ దౌర్జన్యం!

‘పెద్దిని వదలకుండా.. ఉండాల్సింది సరోజ్‌

Follow Us