AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Powder: వేలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోండి!

జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని చాలా మంది మార్కెట్‌లో దొరికే ఖరీదైన ప్రోటీన్ పౌడర్స్‌ను వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో చాలా మంది డబ్బులకు ఆశపడి వాటి నాణ్యతను తగ్గిస్తున్నారు. కాబట్టి అలాంటి వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం ఎంతో ముఖ్యం. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

Protein Powder: వేలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోండి!
Homemade Protein Powder
Anand T
|

Updated on: Jun 10, 2026 | 3:19 PM

Share

ఈ మధ్య చాలా మంది స్లిమ్‌గా అవ్వాలి, బాడీని పిట్‌గా ఉంచుకోవాలి అనుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌ వెళ్లడం డైట్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. అయితే మనం బలంగా ఉండాలంటే కేవలం జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేస్తే సరిపోదు. కండరాల పెరుగుదల, ఎముకల బలానికి కావాల్సిన ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. జనాలు ఎక్కువగా మార్కెట్‌లో దొరికే ఖరీదైన ప్రోటీన్ పౌడర్స్‌ను వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కల్తీ ప్రపచంలో ఇవి తినడం అంత సురక్షితం కాకపోవచ్చు. కాబట్టి ఇంట్లోనే చాక్లెట్ ప్లేవర్ ప్రోటీన్ పౌడర్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

ఓట్స్, బాదం, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, కోకో పౌడర్ వంటి పోషకమైన పదార్థాలతో ఇంట్లో తయారుచేసుకునే ఈ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్, ఎముకలను బలపరిచి, కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిని సులభంగా ఎలా తయారు చేయాలో మరియు దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇంట్లోనే చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం ఎలా

పోషకాహార నిపుణురాలు కిరణ్ కుర్కేజా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా ఇంట్లోనే చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో పంచుకున్నారు. ఆయన ప్రకారం.. ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకునేందుకు మనకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇందు కోసం 1 కప్పు వేయించిన శనగలు, 5-6 టీస్పూన్ల ఖర్జూర పొడి, 2-3 టీస్పూన్ల కోకో పొడి, వేయించిన మిశ్రమ నట్స్, విత్తనాలు ఉంటే సరిపోతుంది.

ప్రోటీన్ పౌడర్ తయారీ విధానం

ప్రోటీన్ పౌడర్ తయారు చేసేందుకు ముందుగా పైన చెప్పిన గింజలు అన్ని రెడీ చేసి పెట్టుకొండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గింజలు అన్నింటి వేసి మొత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులో చాక్లెట్ పౌడర్ యాడ్ చేసే మరోసారి బాగా కలపండి. అంతే మీ ప్రోటీన్ పౌడర్ రెడీ అయినట్టే. దాన్ని మిక్సీ జార్‌లోంచి తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మార్నింగ్ జిమ్‌కు వెళ్లే ముందు లేదా జిమ్‌ నుంచి వచ్చిన తర్వాత, పాలు లేదా నీటిలో కలిపి తీసుకోండి.

ప్రోటీన్ పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాలు

మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్ మన కండరాలను, ఎముకలను బలపరచడానికే కాకుండా, అనేక ఇతర విధాలుగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వర్కౌట్‌ లేదా వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ప్రోటీన్ పౌడర్ కండరాల మరమ్మత్తుకు, పెరుగుదలకు సహాయపడి, మీ శరీర బలాన్ని పెంచుతుంది. ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది, దీనివల్ల ఆకలి, అతిగా తినడం వంటివి తగ్గుతాయి. ఇది మీరు త్వరగా బరువు పెరగకుండా చూసుకుంటుంది. అలాగే ఇది జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

వీడియో చూడండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి