Farmers: రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.38 వేలు.. 15 రోజుల్లోనే..
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. అయితే చాలామందికి వీటి గురించి అవగాహన లేదు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరినప్పుడు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పరిహారం అందిస్తుంది. వర్షాలు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్రం ఆర్ధిక సాయం అందిస్తోంది. 2016లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు చాలామందికి రైతులు దీని వల్ల ప్రయోజనం పొందారు. ఈ స్కీమ్ ద్వారా రైతులు కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా ప్రీమియంను భరిస్తాయి.
అతి తక్కవ ప్రీమియంతో పంట బీమా
అతి తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు తమ పంటకు బీమా పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. అకాల వర్షాల, వరదల వల్ల దేశవ్యాప్తంగా రైతుల పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతులు తాము పండించిన పంట నష్టపోతున్నారు. దీని వల్ల పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అవుతుంది. దీంతో రైతులను అలాంటి సమయాల్లో ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకమే ఇది. కేవలం రైతుల కోసం మాత్రమే ఈ పథకం ప్రవేశపెట్టారు. రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్‌లో 2 శాతం, రబీ సీజన్ 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తాయి.
బీమా వేటికి వరిస్తుంది..?
వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు వర్తిస్తుంది. ఇక పంట కోసాక పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజలు వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేశాక కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు. రైతులు రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. దీంతో రైతులు స్వచ్చంధంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ది పొందాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నారు. పంట నష్టపోయినప్పుడు మీకు పరిహారం అందుతుంది. దీని వల్ల మీ నష్టం కొంతవరకు తగ్గుతుంది. దీంతో రైతులకు ఎంతో ఉపయోగపడే పథకంగా దీనిని చెప్పవచ్చు.
