AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: రైతులకు కేంద్రం బిగ్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. రైతుల అతి తక్కువ ప్రీమియంతో ఇందులో చేరవచ్చు. ప్రకృతి వైఫరీత్యాలు, తెగుళ్లు వంటి వాటి వల్ల పంట నష్టపోయినప్పుడు పరిహారం అందుతుంది. ఈ స్కీములో ఎలా చేరాలంటే..?

Central Government: రైతులకు కేంద్రం బిగ్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..
Pradhan Mantri Fasal Bima Y
Venkatrao Lella
|

Updated on: Aug 12, 2026 | 12:59 PM

Share

తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు బిగ్ అలర్ట్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరేందుకు గడువు ముగియబోతుంది. ఆగస్ట్ 15 వరకు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకుని ప్రీమియం చెల్లించేందుకు సమయం ఉంది. ఆ తర్వాత మీరు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఆ పథకంలో చేరలేరు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి పంట సాగు చేస్తున్న రైతులకు ఈ నెల 15 వరకు మాత్రమే సమయం ఉంది. ఆలోపు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇదే చివరి అవకాశంగా చెప్పవచ్చు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఈ పథకంలో ప్రతీఒక్కరూ చేరాలని కోరుతుంది. ఇందులో చేరడం వల్ల మీ పంటకు బీమా వర్తిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మీ చేతికి డబ్బులు అందుతాయి.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరేందుకు పంట నమోదు తప్పనిసరి కాదు. మీ పంట వివరాలను ప్రభుత్వం వద్ద తర్వాత అయినా నమోదు చేసుకోవచ్చు. పంటల బీమాకు ఈ-పంట నమోదు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం మీరు ఏ పంట సాగు చేస్తున్నారనే విషయంపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ఆ పత్రం సమర్పించి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ పథకం ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇది చెల్లించి వెంటనే చేరాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా ఎల్‌నివో పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావంతో వర్షాలు పెద్దగా కురవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ పథకంలో చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు డబ్బులు అందుతాయి. దీంతో ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలని కేంద్రం సూచించింది. అటు పప్పు ధాన్యాల కొనుగోలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫార్మర్ ఐడీ క్యూఆర్ కోడ్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొంది.

ప్రతీ మండల కేంద్రం, గ్రామ స్థాయిలో పంటల బీమాలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇందులో చేరేందుకు ఈకేవైసీ కూడా తప్పనిసరి కాదు. చేరిన తర్వాత ఎప్పుడైనా పూర్తి చేసుకోవచ్చు. గడువు ముగిశాక చేరేందుకు ఎలాంటి అవకాశం ఉండదని, ఇప్పుడే చేరాలని కేంద్రం సూచిస్తోంది. అయితే కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతులందరూ చేరాలని సూచించింది. కేవలం రూపాయి ప్రీమియంతో ఈ పథకంలో చేరవచ్చు. సమీపంలోని రైతు సేవా కేంద్రం, వ్యవసాయ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 2016లో ఈ పథకం ప్రారంభమైంది. వరదలు, వర్షాలు, భూకంపాలు, తెగుళ్లు, క్రిమికీటకాలు వంటి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు పరిహారం అందుతుంది. పంట నష్టపోయిన రైతులకు ఆర్ధిక భరోసాను అందిస్తుంది.

Follow Us