AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు నిలువ పచ్చిడి.. ఇలా చేస్తే దగ్గు జలుబు అన్నీ మాయం

చట్నీలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది పూదీన చట్నీ, మెంతి కూర చట్నీ, టమాటా చట్నీలు ఎక్కువగా తింటుంటారు. కానీ ఎప్పుడూ చేయని , ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు పచ్చడి ఇలా చేసి తింటే రుచి అదిరిపోతుందంట. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందంట. కాగా, ఇప్పుడు మనం కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Sep 23, 2026 | 4:53 PM

Share
కావాల్సిన పదార్థాలు:    కరివేపాకు,  చింతపండు,  నీరు,   నూనె,   ఉప్పు,   బెల్లం. మసాలా పొడి కోసం:   మెంతులు: 1 టేబుల్ స్పూన్, ధనియాలు: 1 టేబుల్ స్పూన్,ఆవాలు: 2 టేబుల్ స్పూన్లు,   జీలకర్ర: 1 టీ స్పూన్ పోపు కోసం:  మినపప్పు: 1/2 టేబుల్ స్పూన్,   పచ్చిశనగపప్పు: 1/2 టేబుల్ స్పూన్,   జీలకర్ర: 1 టీ స్పూన్,   ఆవాలు: 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: 15, ఎండుమిరపకాయలు: 10,   కరివేపాకు: 2-3 రెమ్మలు,  ఇంగువ: 1/4 టీ స్పూన్.

1 / 5
ముందుగా ముదురు కరివేపాకులను ఎంచుకుని రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తడి లేకుండా పొడి క్లాత్ పైన వేసి, ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తడి పూర్తిగా పోయిన తర్వాత, కప్పుతో కొలిచి 5 కప్పుల కరివేపాకును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  1/2 కప్పు చింతపండును  ఒక గిన్నెలో తీసుకుని, 3 కప్పుల నీళ్లు పోయాలి. దీనిని స్టవ్ పైన పెట్టి, మీడియం మంటపై సగం నీళ్లు ఇంకిపోయేంత వరకు  ఉడికించి చల్లార్చుకోవాలి.

2 / 5
దీని తర్వాత చట్నీ రుచికరంగా ఉండటం కోసం మసాలా పొడిని తయారు చేసుకోవాలి. దీని కోసం పాన్‌లో మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసి తక్కువ మంటపై మాడకుండా దోరగా వేయించాలి. వేయించిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి.  అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, కరివేపాకు వేసి మీడియం మంటపై వేయించాలి. కరివేపాకు పూర్తిగా క్రిస్పీగా కాకుండా, తడిపోయి కాస్త మెత్తగా, వేగినట్లు ఉండేలా చూసుకోవాలి. వేగిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి.

3 / 5
ముందుగా, చిన్న మిక్సీ జార్‌లో మసాలా పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్‌లో వేయించిన కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కచ్చాపచ్చాగా ఒకసారి గ్రైండ్ చేయాలి. తరువాత, ఉడికించి చల్లార్చిన చింతపండు గుజ్జు, 1/2 కప్పు కారం, రుచికి సరిపడా ఉప్పు , కావాలంటే 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్‌లా చట్నీ తయారు అవుతుంది.

4 / 5
ఇప్పుడు పోపు సిద్ధం చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో సరిపడ నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పోపును మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్‌లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ.

5 / 5
Follow Us