చాణక్య నీతి : ఈ వ్యక్తులతో ఉండటం మీ జీవితాన్నే నాశనం చేస్తుంది!

Samatha

22 september 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి  ఉపయోగ పడే అనేక  అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేస్తున్నాడు.

ఆ చార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఈ సమాజం వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది.

చాణక్య నీతి

అంతే కాకుండా ఆయన బంధుత్వాలు, ఆర్థికపరమైన విషయాలు, స్వార్ధపూరితమైన వ్యక్తులు ఇలా ప్రతి ఒక్కరి గురించి తెలియజేయడం జరిగింది.

బంధాలు, బంధుత్వాలు

అదే విధంగా ఆయన కొంత మందితో అస్సలే ఉండకూడదు. వారు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతారు అనేది కూడా తెలియజేయడం జరిగింది వారు ఎవరు అంటే?

కొందరు వ్యక్తులు

ఏ వ్యక్తులు అయితే ఎప్పుడూ ఏడుస్తూ ఇతరులపై ఫిర్యాదు చేస్తూ ఉంటారో, వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.

నిరంతరం ఏడవడం

అదే విధంగా మీపై అసూయపడే వ్యక్తులకు కూడా మీరు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంట.

అసూయ పడే వ్యక్తులు

అంతే కాకుండా, అబద్ధాలు చెప్పేవారు.  ఎవరు అయితే నిత్యం అబద్ధాలు చెబుతూ ఉంటారో, వారికి తప్పకుండా దూరంగా ఉండాలి.

నిత్యం అబద్ధాలు చెప్పేవారు

అలాగే ప్రతి చిన్న విషయానికి కోప్పడే వ్యక్తులు,మూర్ఖులు, మొండి వారి పట్ల కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాడు చాణక్యుడు.

మూర్ఖులు