AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండు vs దానిమ్మ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..

Banana vs Pomegranate: రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అరటిపండు, దానిమ్మల్లో శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? రక్తం కోసం దానిమ్మే బెస్ట్ అనుకుంటున్నారా? అసలు ఈ రెండింటిలో ఐరన్ ఎందులో ఎక్కువ ఉంటుంది? అరటిపండు ఇచ్చే విటమిన్లు ఏంటి? దానిమ్మలో ఉండే ప్రత్యేక పోషకాలేంటి? ఈ రెండు పండ్ల మధ్య ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 23, 2026 | 3:34 PM

Share
చాలామంది దానిమ్మ తింటే శరీరంలో రక్తం బాగా పడుతుందని, ఐరన్ పుష్కలంగా లభిస్తుందని నమ్ముతారు. అయితే వాస్తవానికి అరటిపండు, దానిమ్మలలో లభించే ఐరన్ పరిమాణంలో పెద్ద తేడా ఏమీ లేదు. 100 గ్రాముల అరటిపండులో దాదాపు 0.26 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే, అంతే పరిమాణంలోని దానిమ్మలో సుమారు 0.30 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది. ఈ స్వల్ప వ్యత్యాసం కారణంగా రెండింటిలో ఏ పండు కూడా శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందించే ప్రధాన వనరుగా నిలవలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

1 / 5
దానిమ్మ గింజల్లోని కొన్ని సహజ క్రియాశీల పదార్థాలు శరీరంలో ఐరన్ శోషణకు తోడ్పడతాయని కొన్ని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నప్పటికీ, రక్తహీనత నివారణకు దానిమ్మను ఒక పూర్తిస్థాయి చికిత్సగా వాడలేమని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శరీరంలో తీవ్రమైన ఐరన్ లోపం ఉన్నవారు కేవలం పండ్లపైనే ఆధారపడకుండా.. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, గింజలు, మాంసం, చేపలు వంటి ఆహారాలతో పాటు అవసరమైతే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో ముఖ్యం.

2 / 5
మరోవైపు విటమిన్ బి6, పొటాషియం విషయానికి వస్తే అరటిపండు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. 100 గ్రాముల అరటిపండులో ఏకంగా 0.37 మి.గ్రా. విటమిన్ బి6, 358 మి.గ్రా. పొటాషియం లభిస్తాయి. అదే దానిమ్మలో విటమిన్ బి6 కేవలం 0.08 మి.గ్రా., పొటాషియం 236 మి.గ్రా. మాత్రమే ఉంటాయి. విటమిన్ బి6 శరీరంలో ప్రొటీన్ జీర్ణక్రియకు, నరాల పనితీరుకు, ఎర్ర రక్త కణాల తయారీకి తోడ్పడుతుంది. అందుకే తక్షణ శక్తితో పాటు గుండె ఆరోగ్యం, నరాల పుష్టి కోసం అరటిపండును ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమైన మార్గం.

3 / 5
అయితే రోగనిరోధక శక్తి, కణాల రక్షణ, జీర్ణక్రియల పరంగా చూస్తే దానిమ్మ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుంది. 100 గ్రాముల దానిమ్మలో 4 గ్రాముల ఫైబర్, 10.2 మి.గ్రా. విటమిన్ సి, 38 మైక్రోగ్రాముల ఫోలేట్‌తో పాటు శరీరానికి మేలు చేసే శక్తివంతమైన పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. అరటిపండుతో పోలిస్తే దానిమ్మలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ స్థాయిలు ఎక్కువ. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కణాల క్షీణతను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

4 / 5
మొత్తంగా చూస్తే అరటిపండు, దానిమ్మలను పరస్పర పోటీ పండ్లుగా చూడాల్సిన అవసరం లేదు. అరటిపండు సులభంగా లభించే చవకైన పోషకాహారంగా పొటాషియం, విటమిన్ బి6 అందిస్తే.. దానిమ్మ తన ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ లోపానికి ఈ పండ్లు ప్రత్యామ్నాయం కానప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఒకదానిపైనే ఆధారపడకుండా మీ శరీర అవసరాలకు అనుగుణంగా ఈ రెండు పండ్లను ఆహారంలో సమపాళ్లలో చేర్చుకోవడమే సరైన ఆరోగ్య సూత్రం.

5 / 5
Follow Us