AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

eMudhra: ఈ-ముద్ర సంస్థలో భద్రతా లోపాలపై మరో అప్డేట్.. అసలు ఏం జరిగింది..?

భారత్‌కు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ-ముద్ర సంస్థలో భద్రతాపరమైన లోపాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. వెబ్ సైట్ల భద్రత కోసం ఈ సర్టిఫికేట్లను ఈ సంస్థ జారీ చేస్తోంది.

eMudhra: ఈ-ముద్ర సంస్థలో భద్రతా లోపాలపై మరో అప్డేట్.. అసలు ఏం జరిగింది..?
E Mudra
Venkatrao Lella
|

Updated on: Oct 21, 2026 | 7:56 PM

Share

ఈ-ముద్ర సంస్థకు చెందిన పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (PKI) వ్యవస్థలో భద్రతాపరమైన ఘటనలు చోటుచేసుకున్నట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చనే జరుగుతోంది. ఈ క్రమంలో ఈ ఘటనపై మరో అప్డేట్ వచ్చింది. ఈ-ముద్ర సంస్థలోని భద్రతా లోపాలు చోటుచేసుకున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించి. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ఒక ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పషక్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు, eSign సేవలు అందిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖపరిధిలోని కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్ (CCA) ఆధ్వర్యంలో ఈ సేవలను ఆ సంస్థ నిఅందిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వెబ్ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లుకు డిజిటల్ సర్టిఫికెట్లను కూడా ఈ-ముద్ర సంస్థ జారీ చేస్తోంది. వెబ్‌సైట్లతో పాటు సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ సమాచారానికి భుద్రతను అందించడంలో ఈ సర్టిఫికెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు స్వతంత్ర ఆడిట్‌లు నిర్వహించే సేవలు కూడా ప్రధానంగా అందిస్తోంది. అయితే స్వతంత్ర ఆడిట్లు నిర్వహించే విభాగంలో భద్రతా లోపలు బయటపడ్డాయని వార్తలు వస్తున్నాయి. దీనితో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు అందించే సేవలతో సంబంధం లేదని అంటున్నారు. దీని ప్రభావంతో భారత్‌లోని వెబ్ సైట్లు, అప్లికేషన్లపై ఉండదని చెబుతోంది. ఈ భద్రతా లోపాలను నివారించేందుకు కేంద్రం మంత్రిత్వశాఖతో కలిసి ఈ-ముద్ర పనిచేస్తోంది. భద్రతా లోపాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా.. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలను బయటకు రానన్నాయి.

అసలు వివాదం ఏంటి..?

ఈ-ముద్ర అనేది భారత్‌కు చెందిన ఒక ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ. వెబ్ సైట్లు, ఆన్‌లైన్ సేవలకు డిజిటల్ సర్టిఫికేట్లను ఇది జారీ చేస్తోంది. అలాగే డిజిటల్ గుర్తింపు, అథెంటికేషన్‌కు సంబంధించిన సేవలు అందిస్తోంది. ఈ సర్టిఫికేట్లు వెబ్‌సైట్లకు గుర్తింపు కార్డుల తరహాలోనే పనిచేస్తాయి. అయితే ఈ కంపెనీ జారీ చేసే 8 సర్టిఫికేట్లలో ప్రైవేట్ కీలు బలహీనంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపస్తున్నాయి. ఎవరైనా సులభంగా చేధించే విధంగా ఉన్నట్లు కొంతమంది గుర్తించారు.

Follow Us