Pan Card: మీ పాన్ కార్డు ఇతరులు ఉపయోగిస్తే సింపుల్ తెలుసుకోవచ్చు.. ఆన్‌లైన్‌లో ఈ పని చేస్తే చాలు.
పాన్ కార్డును ఆర్దిక లావాదేవీలను నిర్వహించుకోవడంలో ఉపయోగపడుతుంది. మీ ద్వారా జరిగే పెద్ద లావాదేవీలకు పాన్ సమర్పించడం తప్పనిసరి. అయితే మీ పాన్ కార్డు దుర్వినియోగం అయితే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో వేరేవారు మీ పాన్ ఉపయోగిస్తే మీరు సులువుగా తెలుసుకోవచ్చు.

పాన్ కార్డు అనేది ప్రతీఒక్కరికి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా చెప్పవచ్చు. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ వరకు ప్రతీచోట ఇది అవసరమవుతుంది. ఈ కార్డు లేకుండా మీరు ఎలాంటి పెద్ద ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు జీతం పొందాలన్నా పాన్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్ ఉపయోగించి మీ పేరుపై నకిలీ లావాదేవీలు జరిగినా మీరే బాధ్యతలవుతారు. దీంతో మీరు ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డు ద్వారా అక్రమార్కులు దుర్వినియోగానిక పాల్పడే అవకాశముంటుంది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఏం చేయాలి..? ఎవరైనా మీ పాన్ కార్డును దుర్వినియోగం చేశారనేది ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.
పాన్ దుర్వినియోగం అయిందో.. లేదో ఎలా చెక్ చేసుకోవాలి?
-ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. ఎందుకు మీ పాన్ కార్డు ఉపయోగించి ఏమైనా లావాదేవీలు చేసి ఉంటే సిబిల్ రిపోర్టులో ఎంట్రీ అవుతుంది. మీరు చేయకుండా ఏదైనా లావాదేవీ కనిపించినట్లయితే వెంటనే జాగ్రత్త పడండి. CIBIL, Equifax, Experian, CRIF హైమార్క్ వంటి ఫ్లాట్ ఫామ్ ద్వారా మీరు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ యాక్సెస్ చేయవచ్చు.
– ఒకవేళ దుర్వినియోగం జరిగినట్లు అనిపిస్తే ఐటీ శాఖ ఫిర్యాదుల పోర్టల్ https://incometax.intalenetglobal.com/pan/pan.aspకి వెళ్లి వివరాలు నమోదు చేసి కంప్లైంట్ చేయండి
-కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ క్రైమ్ పోర్టల్ https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయండి.
-ఐటీ శాఖకు చెందిన https://www.incometax.gov.in/iec/foportal/ పోర్టల్ ద్వారా ఫారం 26ఏఎస్, ట్యాక్స్ పాస్‌బుక్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ పాన్ నెంబర్‌పై జరిగే లావాదేవీలు ఇక్కడ కనిపిస్తాయి. మీకు సంబంధం లేని లావాదేవీలు ఉంటే అప్రమత్తం కావొచ్చు.
-జీఎస్టీ పోర్టల్‌లో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఏమైనా లావాదేవీలు జరిగినా తెలుసుకోవచ్చు.
పాన్ కార్డును సురక్షితంగా ఉంచుకోవడం ఎలా..?
మీ పాన్ కార్డును ఎక్కడ పడితే అక్కడ అందించకండి. ఆన్‌లైన్‌లో అనేక నకిలీ వెబ్ సైట్లు, యాప్‌లలో అప్‌లోడ్ చేయకపోవడం మంచిది. ఏదైనా అవసరం ఉండి అప్‌లోడ్ చేసేటప్పుడు ఆ సంస్థ సరైనదా.. కాదా అనేది తనిఖీ చేసుకోండి. జారాక్స్ కాపీలను కూడా ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. ఆధీకృత పనులకు మాత్రమే ఉపయోగించండి. మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. పాన్ ద్వారా ఏమైనా దుర్వినియోగం జరిగినా తెలుసుకునే అవకాశముంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ పాన్ కార్డు దుర్వినియోగం అవ్వకుండా సురక్షితంగా కాపాడుకోవచ్చు.
