AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయం భయంగా బాలీవుడ్‌.! బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రెక్కీలతో వణికిపోతున్న సెలిబ్రిటీలు

సల్మాన్.. కళ్లుమూసుకుని ఒక్క సారీ చెప్పెయ్. నీతోపాటు మేమంతా కూడా బతికిపోతామ్, అందరం కలిసే బలుసాకులు తిందాం! అనూప్ జలోటా అనే స్టార్ సింగర్ కండలవీరుడికిచ్చిన ఒక ఉచిత సలహా ఇది. బిష్ణోయ్ గ్యాంగ్‌కి జడుసుకుని నెలరోజులుగా బిక్కుబిక్కుమంటున్న బీటౌన్‌కి ఇదొక్కటే పరిష్కామని అందరికీ తెలుసు. కానీ, సల్మాన్ సారీ చెబితే, మొత్తం బాలీవుడ్డే సరెండరైనట్టు. మహారాష్ట్ర ప్రభుత్వమే బిష్ణోయ్ ముందు మోకరిల్లినట్టు. ఇది సినిమా పరిశ్రమకే కాదు కేంద్ర ప్రభుత్వానికే సిగ్గుచేటు. కానీ, ఏం చేయాలి.. పాయింట్‌బ్లాంక్‌లో నిలబడి బేలగా చూస్తున్న బాలీవుడ్‌కి సొల్యూషనేంటి..?

భయం భయంగా బాలీవుడ్‌.! బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రెక్కీలతో వణికిపోతున్న సెలిబ్రిటీలు
Lawrence Bishnoi, Salman Khan,
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2026 | 8:15 PM

Share

పాపం బాలీవుడ్.. శాపగ్రస్త బాలీవుడ్. పైకి, మేకపోతులా గంభీరంగా కనిపిస్తున్నా లోపల్లోపల బిక్కచచ్చిపోతూ, భయపడ్డాన్నే ఒక మేనరిజమ్‌గా మార్చుకుంది హిందీ సినిమా ప్రపంచం. అప్పట్లో అండర్‌వరల్డ్.. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్.. సీజనుకోసారి పిచ్చిలేపుతూనే ఉన్నాయి. పేరుమోసిన హీరో కటౌట్లన్నీ తడిసేపోతున్నాయి. దినమొక గండంగా బతికేస్తున్నారు సెలబ్రిటీలంతా. మేకప్‌లో ఉన్నా, ప్యాకప్ ఐపోయినా షేకైపోతోంది ఒక్కొక్కరికి. బీటౌన్‌ని హడలెత్తిస్తున్న డర్ సినిమా సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే అక్టోబర్‌లో మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీకి స్పాట్ పెట్టింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. సిద్ధిఖీని సక్సెస్‌ఫుల్‌గా లేపేశాం అని అరగంటలోపే సోషల్ మీడియాలో పోస్ట్‌ కూడా పెట్టింది. బీటౌన్‌నే కాదు మొత్తం మరాఠా సర్కారునే గత్తర లేపిన హైప్రొఫైల్ మర్డర్ స్కెచ్ అది. బిష్ణోయ్ చేతిలో ఒక మంత్రికే మరణశిక్ష పడ్డం అప్పట్లో పెద్ద సెన్సేషన్. కానీ, సిద్ధిఖీ చేసిన నేరమేంటో తెలుసా? హీరో సల్మాన్‌ఖాన్‌తో ఫ్రెండ్లీగా ఉండడం.. ఒకట్రొండుసార్లు కలిసి డిన్నర్ చేయడం. అంతకుముందు ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర ఫైరింగ్ జరిగింది. ఇదే నీకిచ్చే ఫైనల్ వార్నింగ్ అనే సంకేతాలూ ఇచ్చింది బిష్ణోయ్ గ్యాంగ్. ఐదు కోట్లు ఇస్తే అన్నీ ఆగిపోతాయ్.. లేకుంటే దారుణమైన చావు ఛస్తావ్.. అని వార్నింగూ వచ్చింది. తర్వాత సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్‌కీ ఇటువంటి బెదిరింపే వచ్చినా, జస్ట్‌ఫర్ ఫన్ అంటూ తూచ్ కొట్టేశారు. సల్మాన్‌ఖాన్ లైఫ్ ప్రమాదపుటంచుల్లో పడ్డ మాటైతే నిజం. స్నేహితుడు సిద్ధిఖీ మర్డర్‌ తర్వాత ఆ సీరియస్‌నెస్ ఇంకా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి