AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. ప్రత్యేక రైలు సర్వీసులు.. ఈ ప్రాంతాల మీదుగా..

అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌లో కార్తీక మాసం రానుండటంతో గిరి ప్రదక్షిణ కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం వెళ్లనున్నారు. దీంతో వారి కోసం ఈ రైలు ఉపయోగపడనుంది.

Indian Railways: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. ప్రత్యేక రైలు సర్వీసులు.. ఈ ప్రాంతాల మీదుగా..
Arunachalam
Venkatrao Lella
|

Updated on: Sep 23, 2026 | 3:28 PM

Share

ఏపీ నుంచి అరుణాచలం వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. దసరా, దీపావళి పండుగలు వస్తుండటంతో అరుణాచలం సందర్శించాలనుకునేవారి కోసం ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. ఏపీ నుంచి అరుణాచలం ప్రయాణించేవారికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రం మీదుగా అరుణాచలంకు పలు రైళ్లు వెళుతుండగా.. అందులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ఈ మార్గంలో స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా నరసాపురం టు తిరువణ్ణామలై (07291/97292) ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్లు కూడా మొదలుపెట్టింది. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ట్రైన్ టైమింగ్స్ ఇవే..

నరసాపురం టు తిరువణ్ణామలై (07291) రైలు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంది. ఇది నర్సాపురంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు బయల్దేరి తిరువణ్ణామలైకు సోమవారం ఉదయం 4.55 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై-నర్సాపురం (07292) స్పెషల్ ట్రైన్ ప్రతీ సోమవారం రాత్రి 8 గంటలకు బయల్దేరి మంగళవారం ఉదయం 10.45 గంటలకు చేరుకుంటుంది.

స్టాపు వివరాలు ఇవే..

ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు జనరల్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తం 23 కోచ్‌లు ఉండనుండగా.. ఇందులో ఒక సెకండ్ ఏసీ బోగీ, రెండు థర్డ్ ఏసీ బోగీలు, 14 స్లీపర్ కోచ్‌లు, 4 జనరల్ బోగీలు, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజీ, గార్డ్ వ్యాన్లు అందుబాటులో ఉంటాయి. ఏపీ నుంచి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. నవంబర్‌లో కార్తీక మాసం రానుండటంతో గిరి ప్రదక్షిణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వెళతారు. దీంతో వారి కోసం ఈ ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు.  ఇక నుంచి నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) 07219 ప్రత్యేక రైలు రెగ్యలర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నడవనుంది.

Follow Us