Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ హీరోయిన్ కమ్ సూపర్బ్ సింగర్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే సలాం కొడుతోంది

పై ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి దేశం గర్వించదగ్గ నటి. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత నటనను పక్కన పెట్టేసింది. జర్నలిస్ట్ కావాలని కలలు కంది. కానీ మనసు మళ్లీ నటన వైపే మళ్లింది. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇతర హీరోయిన్లకు భిన్నంగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ హీరోయిన్ కమ్ సూపర్బ్ సింగర్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే సలాం కొడుతోంది
Tollywood Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2024 | 5:50 PM

పై ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి దేశం గర్వించదగ్గ నటి. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత నటనను పక్కన పెట్టేసింది. జర్నలిస్ట్ కావాలని కలలు కంది. కానీ మనసు మళ్లీ నటన వైపే మళ్లింది. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇతర హీరోయిన్లకు భిన్నంగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ రోల్స్ లోనే మెరిసిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. ఉంగరాల జుట్టుతో చూడడానికి పక్కింటమ్మాయిలా కనిపించే ఈ హీరోయిన్ ఇప్పుడు జాతీయ ఉత్తమ నటిగా మారింది. ఇప్పటికే చాలామందికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ క్యూటీ మరెవరో కాదు నిత్యా మేనన్. శుక్రవారం (ఆగస్టు 16) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో జాతీయ ఉత్తమ నటిగా నిలిచింది నిత్యా మేనన్. ఆమెతో పాటు మరో నటి మానసి పరేఖ్ కూడా ఉత్తమ నటిగా నిలిచింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరుచిత్రంబలం (తెలుగులో తిరు)లో తన అద్భుత నటనకు గానూ ఈ అవార్డును అందుకుంది నిత్య మేనన్. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిత్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది నిత్యా మేనన్. అంతకు ముందు మలయాళంలో ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో మెరిసింది. అలా మొదలైంది తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైంది, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమ దేవి, జనతా గ్యారేజ్, గీత గోవిందం, గమనం, స్కైల్యాబ్, భీమ్లా నాయక్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌, నాని వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సౌత్ సినిమాలతో పాటు మిషన్ మంగళ్ సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. ఒక ఇంగ్లిష్ సినిమాలోనూ తళుక్కుమంది. అన్నట్లు నిత్య మల్టీ ట్యాలెంటెడ్. ఆమె కేవలం నటి మాత్రమే కాదు అద్భుతమైన సింగర్ కూడా. ఇలా ఎంతో ప్రతిభ ఉన్న నిత్యకు జాతీయ అవార్డు ఎప్పుడో దక్కాల్సింది అంటున్నారు ఆమె అభిమానులు.

ఇవి కూడా చదవండి

తిరు సినిమాలో నిత్యా మేనన్, ధనుష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.