National Film Awards: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా? అసలు ఊహించలేరు

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఆగస్టు 16) జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ పురస్కారాల్లో ఈసారి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీదే ఆధిపత్యం. మెజార్టీ అవార్డులన్నీ దక్షిణాది సినిమాలకే దక్కాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఇతర ప్రధాన అవార్డులన్నీ సౌత్ సినిమాలకే రావడం విశేషం.

National Film Awards: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా? అసలు ఊహించలేరు
Jani Master
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2024 | 5:22 PM

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఆగస్టు 16) జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ పురస్కారాల్లో ఈసారి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీదే ఆధిపత్యం. మెజార్టీ అవార్డులన్నీ దక్షిణాది సినిమాలకే దక్కాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఇతర ప్రధాన అవార్డులన్నీ సౌత్ సినిమాలకే రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మధ్యన తెలుగులో బాగా ఫేమస్ అయిన ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు లభించింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరిలో ఆయనకు అవార్డు దక్కింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జానీ మాస్టర్ టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా వెలుగొందుతున్నారు. అడపా దడపా తమిళ, కన్నడ సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నామెజారిటీ సినిమాలు మాత్రం తెలుగులోనే చేస్తున్నాడు జానీ మాస్టర్. అయితే ఇప్పుడు వచ్చిన జాతీయ అవార్డు ఆయన చేసిన ఒక తమిళ సినిమాకి రావడం విశేషం. ఆ సినిమానే తిరు చిత్రంబలం (తెలుగులో తిరు). ధనుష్ హీరోగా నటించిన ఈ ప్రేమకథా చిత్రంలో నిత్యా మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరెకెక్కించిన ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.

తిరు సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.ముఖ్యంగా మేఘం కరిగేనా సాంగ్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. లిరిక్స్, బీజీఎమ్ లకు తోడు ధనుష్, నిత్య స్టెప్పులు ఈ సాంగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడిదే పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకోనున్నారు జానీ మాస్టర్. అయితే ఆయన ఈ అవార్డుని మరొక కొరియోగ్రాఫర్ తో కలిసి పంచుకోవాల్సి ఉంది. సతీష్ కృష్ణన్ తో కలిసి జానీ మాస్టర్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే తిరు సినిమాకు గానూ నిత్యా మేనన్ కి బెస్ట్ యాక్ట్రెస్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు లభించింది. అయితే ఆమె కూడా మానసి పరేఖ్ తో కలిసి ఈ అవార్డుని పంచుకోవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మేఘం కరిగేనా ఫుల్ సాంగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.