Snehithudu Movie: స్నేహితుడు సినిమాలో మిల్లిమీటర్ గుర్తున్నాడా..? ఇప్పుడు హీరోలకే పోటీ ఇస్తున్నాడుగా.. ఫోటోస్ చూశారా..
చైల్డ్ ఆర్టిస్టులుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటీనటులుగా దూసుకుపోతున్న తారల గురించి చెప్పక్కర్లేదు. అయితే కొందరు హీరోహీరోయిన్లుగా అలరిస్తుండగా.. మరికొందరు మాత్రం సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తుంటారు. అలాగే కొందరు చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉంటారు. ఒక్క సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న తారల గురించి తెలిసిందే.
సాధారణంగా సినీ పరిశ్రమలో బాలనటీనటులుగా ఎన్నో సినిమాల్లో అలరించి ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. చిన్న వయసులోనే తమదైన నటనతో మెప్పించి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొన్నాళ్లకు హీరోహీరోయిన్లుగా వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటీనటులుగా దూసుకుపోతున్న తారల గురించి చెప్పక్కర్లేదు. అయితే కొందరు హీరోహీరోయిన్లుగా అలరిస్తుండగా.. మరికొందరు మాత్రం సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తుంటారు. అలాగే కొందరు చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉంటారు. ఒక్క సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న తారల గురించి తెలిసిందే. అందులో రిన్సన్ సైమన్. ఈ పేరు చెబితే అసలు ఎవరు గుర్తుపట్టలేరు. కానీ మిల్లీ మీటర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటించిన సూపర్ హిట్ స్నేహితుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు రిన్సన్ సైమన్. ఇందులో మిల్లీ మీటర్ పాత్రలో తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. తన యాక్టింగ్, కామెడీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమాలో నటించిన మిల్లీ మీటర్ కాస్త ఇప్పుడు సెంటీ మీటర్ గా మారిపోయాడు. అవును.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన రిన్సన్ సైమన్.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. రిన్సన్ సైమన్.. 1995లో ఆగస్ట్ 4న చైన్నెలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టమున్న రిన్సన్ మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి లిటిల్ మాస్టర్స్, డ్యాన్స్ రియాల్టీ షో జోడీ నంబర్ 1, సీజన్ 5 వంటి షోలో పాల్గొన్నాడు. అంతేకాకుండా విజయ్ టీవీ ఛానల్లో మాజీ డ్యాన్సర్ కూడా.
కొరియోగ్రాఫర్ గా సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అనుకోకుండా నటుడిగా మారాడు. 2008లో కళై సినిమాతో తమిళ్ సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో కుట్టి పిసాసే పాటలో గ్రూప్ డ్యాన్సర్ గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత సిలంబరసన్, వేదిక, సంగీత క్రిష్, సీమ, సంతానం వంటి చిత్రాల్లో నటించాడు. 2012లో శంకర్, విజయ్ కాంబోలో వచ్చిన స్నేహితుడు సినిమాలో మిల్లీ మీటర్ పాత్రలో అవకాశం వచ్చింది. ఈ మూవీతో తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఈ సినిమా తర్వాత 2013లో సుత్తా కధై సినిమాలో నటించిన రిన్సన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. కొన్నాళ్లపాటు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రన్సన్ ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో సైలెంట్ అయ్యాడు. రిన్సన్ చివరిగా ధనుష్ నటించిన పాండి చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. తాజాగా రిన్సన్ లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.