Aattam Movie: జాతీయ ఉత్తమ చిత్రం ‘ఆట్టం’.. అసలేంటీ మూవీ, అంతలా ఏముంది.?
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేరళలో ఓ నాటక బృందం నాటకాలు ప్రదర్శిస్తుంటుంది. నిజానికి వీళ్లు ఫుల్ టైమ్ నాటకాలు వేయరు. వారి వారి పనుల్లో బిజీగా ఉండే 12 మంది టైమ్ దొరికికప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ 12 మందిలో అంజలి అనే అమ్మాయి కూడా ఒకరు. కాగా ఓసారి వీళ్ల ప్రదర్శన తెగ నచ్చిన ఓ విదేశీ జంట తమ రిసార్ట్‌లో వారికి అతిథ్యమిస్తుంది...
కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన ఈ జాబితాలో ఉత్తమ చిత్రంగా ఆట్టం అనే మలయాళ సినిమా అవార్డును దక్కించుకుంది. దీంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. నేషనల్ అవార్డ్ వచ్చేంతలా.? ఈ సినిమాలో ఏముంది.? అసలు ఈ సినిమా కథ ఏంటి.? అన్న క్యూరియాసిటీ ఈ సినిమాపై ఏర్పడింది. ఇంతకీ ‘ఆట్టం’ మూవీ కథేంటి.? ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేరళలో ఓ నాటక బృందం నాటకాలు ప్రదర్శిస్తుంటుంది. నిజానికి వీళ్లు ఫుల్ టైమ్ నాటకాలు వేయరు. వారి వారి పనుల్లో బిజీగా ఉండే 12 మంది టైమ్ దొరికికప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ 12 మందిలో అంజలి అనే అమ్మాయి కూడా ఒకరు. కాగా ఓసారి వీళ్ల ప్రదర్శన తెగ నచ్చిన ఓ విదేశీ జంట తమ రిసార్ట్‌లో వారికి అతిథ్యమిస్తుంది. ఆ సమయంలో రాత్రంతా పార్టీ చేసుకుంటారు. అనంతరం ఎవరికి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు.
అయితే ఇదే సమయంలో తనను కేటాయించిన గదిలో కిటికీ పక్కన పడుకుటుంది. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి అంజలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.? అంజలితో అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిని ఎలా కనుగొంది అనేదే సినిమా స్టోరీ. అయితే తనతోనే ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం పట్ల అంజలి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే క్రమంలో అసలు మనుషులు ఎలా ఉంటారు.? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.? తనను మంచోడని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసే ఎల మాట్లాడుతారు.? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు అద్భుతంగా ప్రస్తావించారు.
ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే అతను చేసే ఏ పని మనకు నచ్చదని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ఇక ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి మరో ప్రధాన కారణం ఇందులో నటీనటుల అద్భుత నటన. చిన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కంటే ముందు మరెన్నో పురస్కారాలను కూడా సినిమా దక్కించుకుంది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాను ప్రదర్శించారు. కాగా ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ కేవలం మలయాళ భాషలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..