National Film Awards: జాతీయ అవార్డులు గెల్చుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. గతేడాది ఆరు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈసారి మాత్రం ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకుంది.
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. గతేడాది ఆరు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈసారి మాత్రం ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకుంది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘కార్తికేయ 2’ మాత్రమే ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. ప్రయోగాలకు పెద్దపీట వేసే మలయాళ, తమిళ సినిమాలే ఈసారి జాతీయ అవార్డుల్లో ఆధిపత్యం చూపాయి. మరి ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాలు గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.
1. జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా ‘ఆట్టమ్’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. (తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది)
2. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి అవార్డు తెచ్చిపెట్టిన ‘కాంతార’.. అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది. (తెలుగు వెర్షన్ కూడా)
3. జాతీయ ఉత్తమ నటిగా నిత్యా మీనన్ ను నిలిపిన ‘తిరు’ సినిమా సన్ నెక్స్ట్ లో చూడొచ్చు ( తెలుగు లోనూ ఉంది)
4. ఉత్తమ నటిగా మానసి పరేఖ్ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ‘కచ్ ఎక్స్‌ప్రెస్’ షీమారో మీ అనే ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ లో ఉంది
5. ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డుకు ఎంపికైన కార్తికేయ 2(తెలుగు) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
6. పొన్నియిన్ సెల్వన్-1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది (తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది)
7. విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో అవార్డులు అందుకున్న ‘బ్రహ్మస్త్ర’.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
8. సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది.
9. వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు , జీ5 ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
10. ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన ‘మలికాపురమ్’.. సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు
11. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన ‘కేజీఎఫ్ 2’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
12. ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో పురస్కారాలు గెలిచిన బెంగాలీ సినిమా ‘అపరాజితో’.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
13. కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో చూడొచ్చు.
14. గుల్ మోహర్ (హిందీ)..డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
15. ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన ‘ఊంచాయ్’.. జీ5లో అందుబాటులో ఉంది.
16. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు అవార్డులను అందుకున్న ఆడు జీవితం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి