Horror Web Series: చూస్తున్నంత సేపూ గుండెల్లో దడ పుట్టించే హార్రర్ వెబ్ సిరీస్.. ఆ ఓటీటీలో చూసేయండి..

రొమాంటిక్ లవ్ స్టోరీస్, హారర్ థ్రిల్లర్ మూవీస్.. ఇలా విభిన్న కంటెంట్ కథా చిత్రాలు అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మలయాళం మంచి మరో కొత్త వెబ్ సిరీస్ రాబోతుంద. అది కూడా హారర్ జానర్ కావడం విశేషం. ఈ సిరీస్ కొత్త పోస్టర్ షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట.

Horror Web Series: చూస్తున్నంత సేపూ గుండెల్లో దడ పుట్టించే హార్రర్ వెబ్ సిరీస్.. ఆ ఓటీటీలో చూసేయండి..
1000 Babies
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2024 | 4:27 PM

కొన్నాళ్లుగా మలయాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీస్, హారర్ థ్రిల్లర్ మూవీస్.. ఇలా విభిన్న కంటెంట్ కథా చిత్రాలు అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మలయాళం మంచి మరో కొత్త వెబ్ సిరీస్ రాబోతుంద. అది కూడా హారర్ జానర్ కావడం విశేషం. ఈ సిరీస్ కొత్త పోస్టర్ షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. కొత్తగా రాబోతున్న వెబ్ సిరీస్ టైటిల్.. 1000 బేబీస్. ఇందులో రెహమాన్, నీనా గుప్తా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోస్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తాజాగా ఈ సిరీస్ గురించి వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఇదొక హారర్ డ్రామాగా తెలుస్తోంది. అందులో ఓ అడవిలో చెట్ల మధ్య ఉన్న ఉయ్యాలలు, ఓ పాప కనిపిస్తుంది. 1000 బేబీస్ వెబ్ సిరీస్ లో సంజూ శివరామ్, ఆదిల్, జాయ్ మాథ్యూ, శ్రీకాంత్ మురళీ, అశ్విని కుమార్, ఇర్షాద్ అలీ కీలకపాత్రలు పోషించారు.

ఆద్యంతం ట్విస్టులతో కొనసాగే హారర్ వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులకు ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చుద. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మలయాళం కంటెంట్ కూడా ఎక్కువే. మలయాళం నుంచి తొలిసారి వచ్చిన కేరళ క్రైమ్ ఫైల్స్ కూడా ఇదే ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇప్పటికే మలయాళీ వెబ్ సిరీస్, మూవీస్ ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.