Raayan OTT: అఫీషియల్.. ముందుగానే ఓటీటీలోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ.. ‘రాయన్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం రాయన్. ఇది అతని కెరీర్ లో 50వ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా  వహించాడు ధనుష్. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు

Raayan OTT: అఫీషియల్.. ముందుగానే ఓటీటీలోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ.. 'రాయన్' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Dhanush Raayan Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2024 | 2:04 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం రాయన్. ఇది అతని కెరీర్ లో 50వ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా  వహించాడు ధనుష్. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా రాయన్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ లో ఈ మూవీకి ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు నాట సుమారు 550 థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల రాయన్ మూవీ థియేటర్లలో ఆడుతోంది. అయితే ఓటీటీలో ధనుష్ సినిమాను చూద్దామన్న వారికి ఒక శుభవార్త. రాయన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 23 నుంచి రాయన్ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ,తమిళ్, మలయాళ భాషల్లో ధనుష్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. అలాగే రాయన్ సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

రాయన్ సినిమాలో ధనుష్ చెల్లెలు దుర్గగా దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. అలాగే కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు.. తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు అందించడం విశేషం. ఇందులో ‘ఉసురే నీతానే’ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ రీల్స్ నే దర్శనమిస్తున్నాయి. మరి రాయన్ సినిమాను థియేటర్ లో మిస్ అయ్యారా? అయితే ఒక వారం ఆగండి.. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరో వారం లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.