Surya Kumar Yadav: షాకింగ్.. టీ20 కెప్టెన్‌గా సూర్య కొన్ని రోజులే! మళ్లీ అతనికే భారత జట్టు పగ్గాలు

2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత టీ20 జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా, గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. వీటన్నింటితో పాటు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించడం అతిపెద్ద మార్పు.

Surya Kumar Yadav: షాకింగ్.. టీ20 కెప్టెన్‌గా సూర్య కొన్ని రోజులే! మళ్లీ అతనికే భారత జట్టు పగ్గాలు
Surya Kumar Yadav
Follow us

|

Updated on: Aug 17, 2024 | 9:13 PM

2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత టీ20 జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా, గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. వీటన్నింటితో పాటు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించడం అతిపెద్ద మార్పు. శ్రీలంక సిరీస్‌కు ముందు టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యారు. నిజానికి టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా టీ20 జట్టు కెప్టెన్సీకి ప్రధాన పోటీదారుగా పరిగణించారు. కానీ బిసిసిఐ వేరే ప్లాన్‌ని రూపొందించింది. కెప్టెన్ బాధ్యతలను సూర్యకు అప్పగించింది. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే.. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. అయితే వీటన్నింటి మధ్య ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఒక బాంబ్ పేల్చాడు. హార్దిక్ పాండ్యాను T20 జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా చేయవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. హర్ష భోగ్లే ప్రకారం, హార్దిక్ పాండ్యా మరోసారి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉండగలడు. అతను దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పాడు, హర్ష భోగ్లే ప్రకారం, అన్ని వైట్-బాల్ మ్యాచ్‌లు ఆడమని మేనేజ్‌మెంట్ అతనికి సూచించినందున పాండ్యా మళ్లీ కెప్టెన్సీని పొందగలడు.

ప్రయోగాత్మకంగా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీని పాలకమండలి అప్పగించిందని భోగ్లే అన్నారు. పరిమిత ఓవర్లలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, అతనికి కెప్టెన్సీ ఇవ్వడం ఖాయం. మరి హర్ష భోగ్లే మాటల్లో ఎంత వరకు నిజముందో తెలియాలి. ఎందుకంటే లంక పర్యటనకు ముందు విలేకరుల సమావేశంలో టీ 20 కెప్టెన్సీ గురించి మాట్లాడిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, T20 కెప్టెన్సీకి సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ ఎంపిక అన్నాడు. ఈ ఫార్మాట్ లో మిస్టర్ 360 ఇప్పటికే తన ప్రతిభ చూపించాడని ప్రశంసలు కురిపించాడు.

అదే సమయంలో అగార్కర్ కూడా హార్దిక్ గురించి ఒక ప్రకటన చేసాడు. ‘హార్దిక్ కూడా మాకు ముఖ్యమైన ఆటగాడు. అతనిలాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉండడం మన అదృష్టం. అయితే గత రెండేళ్లుగా అతడి ఫిట్‌నెస్ పెద్ద సవాల్‌గా మారింది. అటువంటి పరిస్థితిలో, కెప్టెన్‌గా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా తన పాత్రను చక్కగా పోషించగల ఆటగాడిని మేం కోరుకున్నాము. సూర్య కుమార్ లో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి’ అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 కెప్టెన్‌గా సూర్య కొన్ని రోజులే! మళ్లీ అతనే భారత జట్టు సారథి
టీ20 కెప్టెన్‌గా సూర్య కొన్ని రోజులే! మళ్లీ అతనే భారత జట్టు సారథి
దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
తంగళాన్ సినిమాలో మాళవిక పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..
తంగళాన్ సినిమాలో మాళవిక పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..
'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం నాని ఏం చేశాడంటే?
'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం నాని ఏం చేశాడంటే?
శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా స్టార్ట్..
శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా స్టార్ట్..
ప్రభాస్‌-హను మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌.. అదిరిపోయే డీటెయిల్స్‌..
ప్రభాస్‌-హను మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌.. అదిరిపోయే డీటెయిల్స్‌..
వరలక్ష్మి వ్రతం స్పెషల్.. లంగా ఓణీలో మెరిసిన శ్రీముఖి.. ఫొటోస్
వరలక్ష్మి వ్రతం స్పెషల్.. లంగా ఓణీలో మెరిసిన శ్రీముఖి.. ఫొటోస్
అకౌంట్‌ లేకపోయినా... యూపీఐ పేమెంట్స్‌. కొత్త ఫీచర్‌..
అకౌంట్‌ లేకపోయినా... యూపీఐ పేమెంట్స్‌. కొత్త ఫీచర్‌..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..