Hero Nani: ‘అందుకే అన్నానువ్వంటే మాకిష్టం’.. అభిమాని కోసం హీరో నాని ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్

గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ మరో డిఫరెంట్ మూవీతో హ్యాట్రిక్ కొట్టేందుకు మన ముందుకు వస్తున్నాడు. ఇది నాని కెరీర్ లో 31 వ సినిమా. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టించింది.

Hero Nani: 'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం హీరో నాని ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్
Hero Nani
Follow us
Basha Shek

|

Updated on: Aug 17, 2024 | 8:37 PM

గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ మరో డిఫరెంట్ మూవీతో హ్యాట్రిక్ కొట్టేందుకు మన ముందుకు వస్తున్నాడు. ఇది నాని కెరీర్ లో 31 వ సినిమా. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టించింది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో త‌మిళ న‌టుడు ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌ పోషించాడు. ఇప్పటికే సరిపోదా శనివారం మూవీ నుంచి రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై బజ్ ను క్రియేట్ చేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో హీరో నాని కూడా చురుగ్గా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.తాజాగా తన మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చెన్నై వెళ్లాడీ ట్యాలెంటెడ్ హీరో. అయితే అక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాని ఎయిర్‌పోర్ట్‌లో దిగ‌గానే ఒక అభిమాని అతని దగ్గరకు వచ్చాడు. ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. దీంతో వెంటనే హీరో త‌న‌కు ఆటోగ్రాప్ ఇచ్చాడు. అయితే త‌న టీష‌ర్ట్‌పై కూడా ఆటోగ్రాప్ ఇవ్వ‌మ‌ని నానిని కోరాడు సదరు అభిమాని. దీనిని నాని కూడా నవ్వుతూ టీషర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో సదరు అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది.

ఇక సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే.. గతంలో నాని- వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో అంటే సుందరానికి లాంటి డీసెంట్ హిట్ వచ్చింది. దీని తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సాయి కుమార్, అభిరామి, అదితీ బాలన్, మురళీ శర్మ, అజయ్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అభిమానితో హీరో నాని.. వీడియో ఇదిగో..