Roshan: ఎట్టకేలకు కొత్త సినిమా స్టార్ట్ చేసిన శ్రీకాంత్ తనయుడు.. క్లాప్ కొట్టిన ‘కల్కి’ డైరెక్టర్.. టైటిల్ ఏంటంటే..
హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. పెళ్లి సందడి సినిమా తర్వాత రోషన్ ఏకంగా మూడు సినిమాలు ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో అసలు రోషన్ సినిమాలు స్టార్ట్ అయ్యాయా ? ఎప్పుడూ రిలీజ్ అవుతాయనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా రోషన్ సినిమాల అప్డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. లవ్, ఫ్యామిలీ చిత్రాలతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. కానీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీకాంత్ నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రోషన్. నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. పెళ్లి సందడి సినిమా తర్వాత రోషన్ ఏకంగా మూడు సినిమాలు ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో అసలు రోషన్ సినిమాలు స్టార్ట్ అయ్యాయా ? ఎప్పుడూ రిలీజ్ అవుతాయనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా రోషన్ సినిమాల అప్డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్.
తాజాగా శనివారం రోషన్ నెక్ట్స్ సినిమా అప్డేట్ వచ్చింది. కల్కి సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో గత సంవత్సరం రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమాను ప్రకటించారు. తాజాగా నేడు ఈ ఛాంపియన్ పూజా కార్యక్రమం జరిగింది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రోషన్ పై క్లాప్ కొట్టి సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఛాంపియన్ సినిమా షూట్ మొదలవ్వనుంది. సినిమా ప్రకటించిన తర్వాత సంవత్సరానికి సినిమా మొదలవ్వడంతో ఇప్పటికైనా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీకాంత్ గేమ్ ఛేంజర్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఇందులో అంజలి కీలకపాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే మరికొన్ని సినిమాల్లో శ్రీకాంత్ నటిస్తున్నాడు.
𝐍𝐞𝐰 𝐛𝐞𝐠𝐢𝐧𝐧𝐢𝐧𝐠𝐬… #Champion 🎬#Roshan @PradeepAdvaitam pic.twitter.com/xzctVdSVhg
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.