Prabhas: ప్రభాస్‌-హను మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌.. అదిరిపోయే డీటెయిల్స్‌..

స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాల చిత్ర యూనిట్‌ చెప్పకనే చెప్పింది...

Prabhas: ప్రభాస్‌-హను మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌.. అదిరిపోయే డీటెయిల్స్‌..
Prabhas Hanu Raghavapudi Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2024 | 8:07 PM

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా శనివారం అధికారింగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాల చిత్ర యూనిట్‌ చెప్పకనే చెప్పింది. కోల్‌కతా హవ్‌డా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ పతాకంతో పాటు పలు విషయాలను ఇందులో ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది.

1940వ దశకంలో జరిగే కథ అని కాన్సెప్ట్‌ పోస్టర్‌లో వివరించారు. అలాగే పోస్టర్‌లో ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రచురించారు. ఆపరేషన్‌ జెడ్‌ అంటూ పేర్కొన్నారు. దీంతో అసలు ఏంటీ ఆపరేషన్‌ జెడ్‌ అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. పోస్టర్‌లో బ్రిటీష్, భారతీయ దళాల మధ్య జరిగిన యుద్ధం గురించి వివరించారు. అలాగే ఇందులో బ్రిటీష్ జెండా కాలిపోతున్నట్లు కనిపిస్తోంది.

సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగినప్పుడు, ఒక యోధుడు చేసిన పోరాటం అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. కాన్సెప్ట్‌ పోస్టర్‌తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీపై ఎలా ముద్ర వేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..