Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్న టాలీవుడ్ హీరో.. అసలు ఊహించలేదుగా

గతేడాది 'అంతా ఉల్టా పుల్టా' అంటూ బిగ్ బాస్ చేసి సందడి అంతా ఇంతా కాదు. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అంచనాలు పెంచేస్తున్నారు. కొత్త సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్న టాలీవుడ్ హీరో.. అసలు ఊహించలేదుగా
Bigg Boss Telugu 8
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2024 | 11:03 AM

బిగ్ బాస్ కొత్త సీజన్ లాంఛింగ్ కు ముహూర్తం ముంచుకొస్తోంది. షో లాంచింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ 1 లేదా 8 వ తేదీల్లో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. గతేడాది ‘అంతా ఉల్టా పుల్టా’ అంటూ బిగ్ బాస్ చేసి సందడి అంతా ఇంతా కాదు. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అంచనాలు పెంచేస్తున్నారు. కొత్త సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా 100 రోజులకు పైగానే బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుందని సమాచారం. మరోవైపు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి. వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రిత ఇలా చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా’ అంటూ అతను చెప్పిన డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. కామెడీ తో పాటు సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్ దిట్ట.సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో అతను పండించిన కామెడీకి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే పలు సినిమాల్లోనూ మెరిశాడు. ఇటీవల తన ట్రేడ మార్క్ డైలాగ్ పేరుతోనే వచ్చిన సినిమా ‘ మస్తు షేడ్స్ ఉన్నాయి రా’ హీరోగా కూడా కనిపించాడు. ఈక్రమంలోనే అభినవ్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ టీమ్ అతనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒక వేళ అతను హౌస్‌లోకి వస్తే ఎంటర్ టైన్మెంట్ డబుల్ అవ్వడం ఖాయం.

ఇవి కూడా చదవండి

అభినవ్ గోమఠం ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Abhiinav Gomatam (@a.gomatam) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Pranay Varma (@prrranay) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?