Karthika Deepam: కార్తీక దీపం ఫేమ్ శౌర్య గుర్తుందా? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే? హీరోయిన్లకు మించిన అందం

సుమారు 1500లకు ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన ఈ టాప్ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబుల పాత్రలు ఎంతగానో ఫేమస్ అయ్యాయి. 2017లో ప్రారంభమైన కార్తీక దీపం.. గతేడాది జనవరిలో ఎండ్ కార్డ్ పడింది. అయితే అభిమానులు గగ్గోలు పెట్టారు. సీజన్ 2 కోసం డిమాండ్ చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం కార్తీక దీపం 2 స్టార్ట్ అయ్యింది.

Karthika Deepam: కార్తీక దీపం ఫేమ్  శౌర్య గుర్తుందా? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే? హీరోయిన్లకు మించిన అందం
Karthika Deepam Sourya
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2024 | 8:22 AM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న టీవీ సీరియల్స్ లో కార్తీక దీపం ముందుంటుంది. సుమారు నాలుగేళ్ల పాటు సాగిన ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. సుమారు 1500లకు ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన ఈ టాప్ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబుల పాత్రలు ఎంతగానో ఫేమస్ అయ్యాయి. 2017లో ప్రారంభమైన కార్తీక దీపం.. గతేడాది జనవరిలో ఎండ్ కార్డ్ పడింది. అయితే అభిమానులు గగ్గోలు పెట్టారు. సీజన్ 2 కోసం డిమాండ్ చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం కార్తీక దీపం 2 స్టార్ట్ అయ్యింది. ఈ సీరియల్ డాక్టర్ బాబు- వంటలక్కలకు కవల పిల్లలుగా దీప, శౌర్య అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రౌడీ బేబీగా శౌర్య అదరగొట్టింది. తన ఎనర్జిటిక్ నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కట్టిపడేసింది. శౌర్య పాత్రలో మెప్పించిన ఈ పాప అసలు పేరు కృతిక. తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ చిన్నారి.. 5 సంవత్సరాల వయసు నుంచే నటన స్టార్ట్ చేసింది. అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్ తెరకెక్కించిన గీతాంజలి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లోనూ మెరిసింది. అయితే కృతికకు గుర్తింపు తెచ్చింది మాత్రం కార్తీక దీపం సీరియల్ నే.

బుల్లితెరపై బాగా ఫేమస్ అయిన కృతిక సినిమాల్లోనూ మెరిసింది. పూర్ణ ప్రధాన పాత్రలో వచ్చిన రాక్షసి అనే చిత్రంలో తళుక్కుమంది. ఆతర్వాత మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోనూ నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం సీరియల్స్, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ట్యాలెంటెడ్ బ్యూటీ చదువుపై దృష్టి సారించింది. ఆ మధ్యన యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినా అందులో పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే ఇన్ స్టా గ్రామ్ ద్వారా మాఆత్రం అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు, రీల్స్ ను అందులో షేర్ చేస్తూ ఫాలోవర్లను ఎంటర్ టైన్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా కార్తీక దీపంలో చాలా క్యూట్ గా కనిపించిన కృతిక ఇప్పుడు కూడా చాలా అందంగా ఉంటూ హీరోయిన్ ను మరిపిస్తోంది. త్వరలోనే ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.