- Telugu News Photo Gallery Cinema photos Jr NTR congratulates Narne Nithiin Aay movie team, Photos goes viral
Jr NTR: బామ్మర్ది కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. ‘ఆయ్’ టీమ్‌కు అభినందనలు.. ఫొటోస్ ఇదిగో
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రమే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Updated on: Aug 18, 2024 | 9:09 AM

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రమే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది ఆయ్ సినిమాను నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

మౌత్ టాక్ బాగా ఉండడంతో ఆయ్ సినిమాకు మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.72 కోట్లు షేర్, రూ. 3.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

దీంతో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఆయ్ టీమ్ ను యంగ్ టగర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

హీరో, హీరోయిన్లను ప్రత్యేకంగా అభినందించిన తారక్.. చిత్ర బృందం సభ్యులందరికీ కంగ్రాట్స్ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఆయ్ సినిమాకు రామ్ మిరియాల అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. సోఫియానా, డైవర్షన్ బ్యూటీ, రంగనాయకి వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.




