Alekhya Tarakaratna: ‘నా కూతుళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది’.. తారకరత్న భార్య ఎమోషనల్.. ఏమైందంటే?

తారకతర్న మరణంతో బాగా కుంగిపోయింది అతని భార్య అలేఖ్యా రెడ్డి. అయితే పిల్లల కోసం దుఃఖాన్ని దిగమింగుకుని లైఫ్ ను లీడ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకుంటోంది. అలాగే తన పిల్లల ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తోంది.

Alekhya Tarakaratna: 'నా కూతుళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది'.. తారకరత్న భార్య ఎమోషనల్.. ఏమైందంటే?
Alekhya Tarakaratna
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2024 | 6:48 AM

తారకతర్న మరణంతో బాగా కుంగిపోయింది అతని భార్య అలేఖ్యా రెడ్డి. అయితే పిల్లల కోసం దుఃఖాన్ని దిగమింగుకుని లైఫ్ ను లీడ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకుంటోంది. అలాగే తన పిల్లల ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తోంది. ఇక అలేఖ్యకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. సమాజంలో జరిగే అన్యాయాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల కోల్‌కత్తాలోని ఆర్‌జీ కేర్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దీనిని ‘మరో నిర్భయ ఘటన’ గా వర్ణిస్తూ వైద్యులందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఘోరంపై స్పందిస్తున్నారు. ఉపాసన కొణిదెల, హృతిక్ రోషన్, కరీనా కపూర్, అలియా భట్, అయుష్మాన్ ఖురానా, రేణూ దేశాయ్ తదితరులు కోల్ కతా హత్యాచార ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాజాగా తారక రత్నసతీమణి అలేఖ్య రెడ్డి ఈ ఘోరంపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది

‘ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడడానికి ప్రయత్నించలేదు. నా హక్కుల కోసం పోరాటం చేయలేదు. కానీ రేపటి నా కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు గళం విప్పుతున్నాను. మహిళలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మన చట్టం. ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడకపోతే కనీసం వాటి గురించి మాట్లాడండి. సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్. ఆ పని నేను చేస్తున్నాను. మరి మీరు చేయగలరా?’ అని ప్రశ్నించింది అలేఖ్య.

ఇవి కూడా చదవండి

తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్..

ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు తారక రత్న భార్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

కోల్ కతా హత్యాచార ఘటనపై అలేఖ్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.