Jasprit Bumrah: లేడీ బుమ్రా వచ్చేసిందోచ్.. బూమ్ బూమ్ స్టైల్‌లోనే బౌలింగ్ చేస్తోన్న అమ్మాయి.. వీడియో వైరల్
టీ 20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో తన సంచలన బౌలింగ్ తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా. ఆడిన ప్రతి మ్యాచుల్లోనూ కీలక సమయంలో వికెట్లు తీసిన ఈ రేసు గుర్రం టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతర బౌలర్ల కంటే భిన్నంగా, డిఫరెంట్ యాక్షన్ తో బంతులేసే బుమ్రా ఇప్పుడు యంగ్ బౌలర్లకు ఒక కొత్త ఇన్‌స్పిరేషన్.
టీ 20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో తన సంచలన బౌలింగ్ తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా. ఆడిన ప్రతి మ్యాచుల్లోనూ కీలక సమయంలో వికెట్లు తీసిన ఈ రేసు గుర్రం టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతర బౌలర్ల కంటే భిన్నంగా, డిఫరెంట్ యాక్షన్ తో బంతులేసే బుమ్రా ఇప్పుడు యంగ్ బౌలర్లకు ఒక కొత్త ఇన్‌స్పిరేషన్. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఓ పాకిస్థానీ కుర్రాడు అచ్చం జస్ప్రీత్ బుమ్రా తరహాలో బౌలింగ్ చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని మరవకముందే మరో అమ్మాయి బుమ్రాను ఆదర్శంగా తీసుకుంది. అచ్చం అతని తరహాలోనే బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. స్కూల్ యూనిఫాంలో ధరించిన ఓ అమ్మాయి బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైదానంలో దూరం నుంచి బుమ్రా ఏ విధంగా రన్ చేసుకుంటూ వచ్చి బంతి విసరతాడో ఈ అమ్మాయి కూడా అదే తరహాలో బౌలింగ్ చేస్తోంది. ఆమె బౌలింగ్ స్పీడ్ కూడా అదే తరహాలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సాాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. లేడీ బుమ్రా వచ్చేసిదంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు యువ తరానికి ఆదర్శంగా మారాడు. చిన్న పిల్లలు కూడా బూమ్ బూమ్ స్టైల్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చూడవచ్చు. అందుకు తాజా ఉదాహరణ ఈ స్కూల్ అమ్మాయి బౌలింగ్. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రపంచకప్ తర్వాత జరిగిన జింబాబ్వే పర్యటనతో పాటు శ్రీలంక టూర్‌కు సైతం అతను దూరంగా ఉన్నాడు. అంతకు ముందు అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా 8 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. భారత జట్టును వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
వీడియో ఇదిగో..
Not only boys but Girls have also started Coping Jasprit Bumrah action BCCI should mentor this Girl 🧒 pic.twitter.com/bbp7n8ecS5
— ICT Fan (@Delphy06) August 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..