AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine vs Headache: మీకున్నది మైగ్రేనా? లేదా సాధారణ తలనొప్పా.. గుర్తించడం ఎలా?

ఈ రోజుల్లో సుమారు 10లో 8 మంది తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇది ఎప్పుడో ఒకసారి వస్తే పెద్ద సమస్యేం కాదు. కానీ ఈ సమస్య మళ్లీ మళ్లీ మిమ్మల్ని వేదిస్తుందటే మీరు వెంటనే అప్రమత్తమవ్వాల్సిందే. ఎందుకంటే అది మైగ్రేన్ కూడా కావచ్చు. ఈ క్రమంలో మీరు సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య వత్యాసం తెలుకొని.. సమస్యను పరిష్కరిచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మైగ్రేన్, సాధారణ తలనొప్పి మధ్య తేడా ఏమిటి, ఈ సమస్యకు కారణాలు ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Migraine vs Headache: మీకున్నది మైగ్రేనా? లేదా సాధారణ తలనొప్పా.. గుర్తించడం ఎలా?
Migraine Vs Headache
Anand T
|

Updated on: Feb 06, 2026 | 5:43 PM

Share

ప్రస్తుత బీజీ లైఫ్, పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది మీకు సాధారణ సమస్యగా మాత్రమే కనిపించవచ్చు. అందుకే చాలా మంది దీనికి అప్పటి పూర్తికి ట్యాబ్లెట్స్ వేసుకొని తప్పించుకుంటారు. కానీ ఈ తలనొప్పి పదేపదే మిమ్మల్ని వేధిస్తుంటే, దీని వల్ల మీ రోజు వారి జీవితంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం కచ్చితంగా మీరు వైద్యులను కలవాల్సిందే. ఎందుకంటే ఇది ఒక రకమైన మైగ్రేన్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

మైగ్రేన్, సాధారణ తలనొప్పి మధ్య తేడా ఏమిటి?

లేడీ హార్డింగ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ ప్రకారం.. మైగ్రేన్లు, సాధారణ తలనొప్పుల మధ్య అతిపెద్ద వ్యత్యాసం నొప్పి స్వభావం, ప్రభావం. మీకు నార్మల్ తలనొప్పి వచ్చినప్పుడు మీ తల, నుదిటిపై కాస్తా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇది అలసట, ఒత్తిడి, నిద్ర లేకపోవడం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల రావచ్చు. కానీ మైగ్రేన్ నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. మైగ్రెన్ వచ్చినప్పుడు తల ఒక వైపున విపరీతమైన పెయిన్ వస్తుంది. అలాగే ఈ తలనొప్పి వచ్చినప్పుడు మీకు వాంతింగ్ సెన్షేషన్ కూడా వస్తుంది. అంతేకాకుండా, ఈ నొప్పి చాలా రోజులు ఉంటుంది, కానీ సాధారణ తలనొప్పులు మాత్రం మీరు ట్యాబ్‌లెట్ వేసుకున్న, లేదా కాసేపు విశ్రాంతి తీసుకున్నా తగ్గిపోతాయి. మైగ్రేన్‌ల తలనొప్పి తగ్గాలంటే మీకు ప్రత్యేక చికిత్స అవసరం. అందుకే రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మైగ్రేన్లను నివారించడానికి చిట్కాలు:

అయితే మన రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్‌లను తగ్గించుకోవచ్చు. మీరు ప్రతి సరైన టైంను ఫిక్స్ చేసుకొని అదే సమయానికి రోజు నిద్రపోవడం ద్వారా మీరు ఈ సమస్య నుంచి కాస్తా ఉపశమనం పొందవచ్చు. అలాగే సరైన సూర్యరశ్మి పొందడం, పెద్ద శబ్ధాలు వినడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువగా చూడడాన్ని తగ్గించండి. అధిక ఒత్తిడి అనేది ముఖ్యంగా మైగ్రేన్‌ను పెంచుతుంది, కాబట్టి ఈ సమస్యను తగ్గించుకునేందకు యోగా, ధ్యానం, లోతైన శ్వాసను తీసుకోవడం ప్రయత్నించండి. వీటితో పాటు సరైన సమయంలో తినడం అలవాటు చేసుకోండి, ఆకలి పెట్టుకొని ఎక్కువ సమయం ఉండకండి. అలాగే ప్రాసెస్ చేసి ఆహారానికి దూరంగా ఉండండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.