AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మరీ ఇలా ఉన్నారేంటప్పా.. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్‌కు జేసీబీతో వెళ్లిన అధికారి.. కట్‌చేస్తే..

ఒక టీ షాపులో వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ఓ మున్సిపల్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. అరగంటలో ప్రోక్లైన్‌తో అక్కడికి వచ్చారు. షాపు ముందు ఉన్న ర్యాంపు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే సీన్ అంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..

Andhra: మరీ ఇలా ఉన్నారేంటప్పా.. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్‌కు జేసీబీతో వెళ్లిన అధికారి.. కట్‌చేస్తే..
Proddutur Coffee Row
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 5:59 PM

Share

ప్రొద్దుటూరు నగరంలో ఉన్న టీ షాపు వద్దకు ఓ మున్సిపల్ అధికారి.. అతనితో పాటు మరో ఇద్దరు కాఫీ తాగడానికి వచ్చారు. అయితే వన్ బై త్రీ కాఫీని ఇవ్వాలని ఆ హోటల్ వారిని కోరారు.. అయితే.. వారు తమ దగ్గర ఇలాంటి పద్ధతి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ హోటల్‌లో ఉన్న సిబ్బందిపై కొద్దిసేపు వాదించిన అధికారి.. ఓ అరగంట తర్వాత జెసిబీతో ఆ హోటల్ ముందు ప్రత్యక్షమయ్యారు. హోటల్ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుందని, డ్రైనేజీ పై రాంప్ ఎందుకు కట్టారని హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. దానిని తొలగిస్తామని పేర్కొన్నారు. దీంతో అధికారి.. హోటల్ యమమాని మధ్య వాదన జరిగింది.

దీంతో చేసేదేమీ లేక ఆ హోటల్ యజమాని జేసీబీ ముందు పండుకొని నిరసన తెలిపారు. నా పైనుంచి ఎక్కించి ర్యాంప్ కూల్చాలని నిరసన తెలిపాడు.. నగరమంతా డ్రైనేజీ లపై ఈ విధంగానే ఉన్నాయని.. తాను ఒక్కడినే దానికి సమస్య కాదు.. అంటూ హోటల్ యజమాని అధికారులతో వాదించారు..

వీడియో చూడండి..

దీంతో చేసేదేమీ లేక ఆ మున్సిపల్ అధికారి వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రొద్దుటూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.. ఈనెల నాలుగవ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..