ప్రపోజ్ డే నాడు.. మనసులోని భావాలను ఇష్టమైనవారికి ఇలా చెప్పేయండి!
Prasanna Yadla
06 February 2026
Pic credit - Pixabay
ప్రేమ అనేది ఒక క్రేజీ ఫీలింగ్. ఒక అందమైన అనుభూతి కూడా అది ఎప్పుడూ ఎవరి మీద పుడుతుందో కూడా తెలీదు. ప్రేమ పుట్టిన క్షణం మరణించే వరకు వారితోనే ఉండాలని మనసు కోరుకుంటుంది.
ఇదొక క్రేజీ ఫీలింగ్
ఫిబ్రవరి 8న ప్రేమికులు ప్రపోజ్ డే ను జరుపుకోనున్నారు. ఇది వాలెంటైన్స్ వీక్‌లో రెండో రోజు. ఈ రోజు లవర్స్ కి చాలా స్పెషల్.
లవర్స్ కి ఈ డే చాలా స్పెషల్
ఎన్ని రోజుల నుంచో దాచుకున్న తమ మనసులోని భావాలను ప్రియమైన వారితో ఈ రోజు పంచుకుని లవ్ ప్రపోజ్ చేస్తారు.
ఈ రోజు ప్రత్యేకత ఇదే!
తమ ప్రేమని ప్రియమైన వారికి వ్యక్తపరిచే రోజే ప్రపోజ్ డే. కొందరు గిఫ్ట్స్ లేదా డిన్నర్ ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తారు.
ప్రపోజ్ డే
నా లైఫ్ లో ఉన్నది ఒకటే ఒక కోరిక అది నీ ప్రేమను పొందడం.. ఈ మాట నీతో చెప్పాలని ఎంతగానో ఎదురుచూశాను ఈ రోజు అవకాశం వచ్చింది.. ఐ లవ్ యూ.. హ్యాపీ ప్రపోజ్ డే.. అని ఇలా విష్ చేయండి.
హ్యాపీ ప్రపోజ్ డే
నా గుండె నీ కోసమే కొట్టుకుంటుంది.. నా మనసు అంతా ప్రేమతో నిండిపోయింది.. నా ఈ మనసును నీకే అంకితం చేస్తున్నాను. హ్యాపీ ప్రపోజ్ డే అని ఇలా విష్ చేయండి.
నా మనసు నీకే అంకితం..
నువ్వు నాతో ఉంటే చాలు.. ఈ ప్రపంచాన్నే గెలిచి వస్తాను.. మరి, జీవితాంతం నాతో నడుస్తావా?హ్యాపీ ప్రపోజ్ డే.. అని ప్రేమగా చెప్పి ఇలా విష్ చేయండి.
జీవితాంతం నాతో నడుస్తావా..
నిన్ను చూశాక నీ ప్రేమే నా శ్వాసగా మారింది.. ఒక్క అవకాశం ఇస్తే.. నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటాను అని చెప్పి పువ్వులు లేదా చాక్లెట్లు ఇచ్చి మీ ప్రేమను తెలియజేయండి.