మన రోజు జీవనశైలిలో ఎక్కువగా తీసుకునే పానీయాల్లో కాఫీ ఒకటి. అలసట నుండి బయటపడడానికి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడానికి కాఫీ ఎంతో సహాయపడుతుంది. కాఫీని తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, పనిపై ఏకాగ్రత పెరుగుతుంది
TV9 Telugu
అయితే కాఫీని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువవడంతో పాటు కొత్త అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
కెఫిన్ శరీరం, మనస్సును ఉత్తేజపరుస్తుంది. నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే ఆందోళన ఉన్నవారు కాఫీ తాగడం వల్ల అది మరింత తీవ్రతరం అవుతుంది
TV9 Telugu
అలాగే జీర్ణ సమస్యలతో ఇబ్బందిపడే వారు, ఆమ్లత్వం సమస్యను ఎదుర్కొనే వారు కాఫీకి దూరంగా ఉండాలి. కాఫీ తాగడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ మరింత ఎక్కువవుతుంది
TV9 Telugu
పేగుల సున్నితత్వం పెరుగుతుంది. ఆహారం జీర్ణమవ్వడం కష్టమవుతుంది. జీర్ణవ్యవస్థతో మొత్తం శరీర ఆరోగ్యం అనుసంధానమై ఉంటుంది కనుక మొత్తం ఆరోగ్యం ప్రభావితమవుతుంది
TV9 Telugu
అలాగే గర్బిణీలు కూడా కాఫీ తీసుకోకూడదు. కెఫిన్ పిండం పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కాఫీ తాగడం వల్ల శిశువు తక్కువ బరువుతో పుట్టడం, గుండె, జననేంద్రియ లోపాలు, న్యూరో సమస్యలు రావడం వంటివి జరుగుతాయి
TV9 Telugu
అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా కాఫీ తీసుకోకపోవడమే మంచిది. కెఫిన్ అడ్రినలిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది గుండె మరింత వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇవన్నీ కూడా కాలక్రమేణా గుండె సమస్యలకు దారి తీస్తాయి
TV9 Telugu
అంతేకాకుండా కాఫీ తాగడం వల్ల శరీరం ఇన్సులిన్ కు ప్రతిస్పందించే సహజ సామర్థ్యాన్ని కూడా కోల్పోతుందని వారు తెలియజేస్తున్నారు. కనుక మనం తాగే కాఫీ విషయంలో కాస్త ఆచి తూచీ వ్యవహరించాలన్నమాట