భూమి కింద మిస్సైల్ బేస్.. ప్రపంచానికి చాటిన’ఇరాన్’
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఇరాన్ తన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ప్రపంచానికి ఆవిష్కరించింది. ఇరాన్ సైనిక సిద్ధాంతం రక్షణ నుంచి దాడుల శైలికి మారిందని, అమెరికా ఏ చిన్న తప్పు చేసినా భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. ఈ చర్య పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ తన సైనిక పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. అమెరికాతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న ఈ సమయంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ‘అండర్ గ్రౌండ్ మిస్సైల్ బేస్’ను ఆవిష్కరించింది. ఇరాన్ సైనిక దళాల అధిపతి అబ్దోల్రహీమ్ మౌసవి బుధవారం ఈ కేంద్రాన్ని సందర్శించి, క్షిపణి యూనిట్ల యుద్ధ సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా, ఇరాన్ తన సైనిక సిద్ధాంతాన్ని రక్షణ నుంచి దాడుల శైలికి మార్చినట్లు మౌసవి ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. గత ఏడాది ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత, ఎదురుదాడి చేయడమే కాకుండా.. శత్రువుపై మెరుపు వేగంతో విరుచుకుపడేలా తమ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు తెలిపారు. అమెరికా గనుక ఏ చిన్న తప్పు చేసినా, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులకు కానీ, వారి స్థావరాలకు కానీ రక్షణ ఉండదని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించడంతో పాటు, ఇరాన్ డ్రోన్లను కూల్చివేస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఒమన్‌లో ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరగనున్నాయన్న వార్తల నడుమ.. ఇరాన్ తన భూగర్భ క్షిపణి నగరాన్ని బయటపెట్టడం ద్వారా వాషింగ్టన్‌కు ఒక బలమైన సంకేతం పంపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..
సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు
ప్రయాణికుడిపై పడిన వేడి వేడి కూర.. విమాన సంస్థకు దిమ్మ తిరిగే జరిమానా
Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు
ప్రయాణికుడిపై పడిన వేడి కూర.. విమాన సంస్థకు దిమ్మ తిరిగే జరిమానా
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్ వైరల్
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్.. తప్పిన పెను ప్రమాదం

