AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026

తెలంగాణలో ఎన్నికల సందడి నెలకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు 2026 ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52.43 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ మున్సిపాలిలకు ఎన్నికలు జరగనున్నాయి.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల పదవీకాలం ఇంకా పూర్తికాలేదు. పదవీకాలం పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జూన్ లేదా జులై మాసాల్లో వీటికి ఎన్నికలు జరిగే అవకాశముందని సమచారం

ఇంకా చదవండి

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?

మాట ఇచ్చాం మడమతిప్పం అంటున్నారు లోకల్ కామ్రేడ్‌లు.. కాదు.. కాదు.. కాంగ్రెస్‌తో కలిసుంటేనే కలదు సుఖం అంటోంది కామ్రేడ్ అదిష్టానం. ఇంత జరిగాక వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామంటున్నారు లోకల్ ఎర్రన్నలు. అలా కాదు మరోసారి ఆలోచించండి.. భవిష్యత్ అవసరాల కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదంటోంది ఆ పార్టీ అధినాయకత్వం.

Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ముగిసింది. ఈ క్రమంలోనే.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. దీంతో మాజీమంత్రికి ఏమైంది. అన్న చర్చ టాక్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది. మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి..

ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్లు.. ఒకరు మేయర్ గా.. మరొకరు గ్రామ సర్పంచ్‌గా..!

రాజకీయాల పట్ల ఆసక్తిలేకున్నా.. కొందరు మహిళలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు గ్రామ సర్పంచ్‌గా.. మరొకరు నగర మేయర్‌గా ఎన్నికై పాలనా పగ్గాలు చేపట్టారు. ప్రజా పాలన చేపట్టిన తల్లీకూతుళ్లు.. గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Kothagudem: ఆటో డ్రైవర్ టు మేయర్.. కొత్తగూడెంలో ఎర్రజెండా సరికొత్త చరిత్ర.. ఎన్నో ట్విస్టుల తర్వాత..

అతనో సామాన్య ఆటో డ్రైవర్.. కట్ చేస్తే.. రాజకీయాల్లోకి అరంగ్రేటం.. బీఆర్ఎస్ పై అభిమానంతో.. 2019లో ఆ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించాడు.. ఆ తర్వాత.. 2023 లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐలో చేరి.. ఏకంగా కార్పోరేషన్ మేయర్ అయ్యాడు.

కాలం కలిసి వస్తే.. అదృష్టం తలుపు తడుతుందంటే ఇదే..! మున్సిపల్ చైర్మన్, వైస్-చైర్మన్‌గా భార్యాభర్తలు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా జూపల్లి శశికళ, ఆమె భర్త జూపల్లి రమేష్ బాబు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరొందిన జూపల్లి రమేష్ దంపతులు నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ ,13వ వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు.

Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్‌గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!

ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్‌లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.

Telangana Municipal Mayor Elections 2026 Highlights: తెలంగాణలో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్‌ ఛైర్మన్‌ల ఎన్నిక.. హైలెట్స్ ఇవే!

Telangana Municipal Mayor, Chairman Elections 2026 Highlights in Telugu: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో పలుచోట్ల హంగ్ ఏర్పడటంతో.. ఇప్పుడు అందరి దృష్టి చైర్మన్ పీఠాలపైనే పడింది. క్యాంపు రాజకీయాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక ఉత్కంఠను రేపుతున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !

తెలంగాణలో మున్సిపల్‌ పోరు ముగిసి మూడు రోజులు అవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఐదు మున్సిపాలిటీలు.. హంగ్ పాలిటిక్స్‌తో హీట్‌ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి.

Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్‌తో కలిసి మేజిక్ ఫిగర్..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

భలే పని చేశారు.. ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థి గిఫ్టులను ఓటర్లు ఏం చేశారో తెలుసా..?

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. విజయం కొందరిని మాత్రమే వరిస్తుంది. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు.. తాము ఇచ్చిన గిఫ్ట్‌లను తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బు, బహుమతులను ఓటర్లు తిరిగి ఇచ్చేస్తున్నారు.

Municipal Election: మున్సిపల్‌ ఛైర్మన్‌, మేయర్‌ ఎన్నికలపై ఎక్స్‌ అఫీషియోల ఎఫెక్ట్‌.. కీలక క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసీ!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు స్థాయి ఫలితాలు వచ్చాక.. రాజకీయ పోరు ఇప్పుడు రెండో దశకు చేరింది. అంటే.. ఛైర్మన్‌, మేయర్‌ల పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికలు నిర్వహించనుంది.

Nalgonda Municipal Election Result: సఫాయి కార్మికురాలుగా సేవ చేసిన చోటే.. నేడు కౌన్సిలర్‌గా ప్రజా సేవ..!

ఆమె ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పని చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదేశాల మేరకు పనిచేసింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30ఏళ్లు తన సేవలు అందించింది. ఆమె ఇపుడు మరో రూపంలో తన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. తొలుత నేరేడుచర్ల గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా 30 ఏళ్లుగా చేసింది.

ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!