తెలుగు యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జెర్నలిజం (ఎం.సీ.జే)చేస్తూ 2008 లో లోకల్ న్యూస్ ఛానెల్ IN Digital ఛానల్ లో రిపోర్టర్ గా చేరాను..
2010 మే లో కొత్తగా ప్రారంభం అయిన రాజ్ న్యూస్ (Tnews)లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను..
2024 మార్చ్ వరకు 14 సంవత్సరాల పాటు Tnews లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను.
2024 ఏప్రిల్ లో Tv9 లో చేరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను
తెలంగాణ పల్లె నుంచి విదేశాల వరకు.. అంకాపూర్ చికెన్‌కు ఇంత క్రేజా? అదరగొడుతున్న రుచి!
దేశీ కోడి మాంసం, అంకాపూర్ ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, సంప్రదాయ వంట పద్ధతి.. ఈ మూడు కలయికే ఈ రుచికి అసలైన ప్రత్యేకత.కోడిని ముక్కలుగా చేసి.. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలు తదితర స్థానిక పదార్థాలతో మసాలా సిద్ధం చేస్తారు. ఆ మసాలాను చికెన్‌కు బాగా పట్టించి.. నెమ్మదిగా ఉడికించడం రుచిని మరింత పెంచుతారు.
- Diwakar P
- Updated on: Sep 7, 2026
- 4:25 pm
ఆ ఆర్టీసీ డిపోలో అంతా వాళ్లే.. సవాళ్లను ఎదుర్కొంటూ సత్తా చాటుతున్న మహిళా కండక్టర్లు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ రూపురేఖలను మార్చివేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. కొంత ఆలస్యమైనా సరే ప్రైవేటు వాహనాలను పక్కనబెట్టి మహిళలు ఆర్టీసీ బస్సుల కోసమే వేచి చూస్తున్నారు. దీనితో బస్సుల్లో కూర్చోవడానికి సీటు దొరకడం పక్కన పెడితే, నిలబడేందుకు కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి అత్యంత రద్దీ వాతావరణంలో బస్సును నడపడం డ్రైవర్‌కు, ప్రయాణికులందరికీ టికెట్లు జారీ చేయడం కండక్టర్‌కు ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సవాళ్లను అధిగమిస్తూ, రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళా కండక్టర్లు పనిచేస్తున్న ప్రత్యేక గుర్తింపును సాధించింది ఆ ఆర్టీసీ డిపో.
- Diwakar P
- Updated on: Sep 2, 2026
- 8:18 am
Watch: అర్ధరాత్రి రోడ్డుపై చిరుతల పరుగు..! పంట పొలాల్లో ఐదు పిల్లలతో తల్లి చిరుత..!
నిజామాబాద్ కల్లెడలో ఐదు చిరుత పిల్లలతో తల్లి చిరుత రోడ్డుపై, పంట పొలాల్లో సంచరించడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. రాత్రి వేళ రోడ్డుపై చిరుత కుటుంబం కనిపించడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. చిరుతల దాడి భయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. చిరుతల కదలికలపై నిఘా పెంచి, ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామస్తులు అటవీశాఖను కోరుతున్నారు.
- Diwakar P
- Updated on: Sep 1, 2026
- 12:31 pm
Indian Railways: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ సూపర్ ట్రైన్ గురించి మీకు తెలుసా?
ఇండియన్ రైల్వే ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రైల్వే వ్యవస్థగా ఎదిగింది. వందేభారత్, అమృత్ భారత్ వంటి హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చినా.. తెలుగురాష్ట్రాల మధ్య నడిచే ఓ పేదల బండికి మాత్రం ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.. 1977లో ప్రారంభమైన ఈ ట్రైన్.. 50 ఏళ్లుగా సేవలు అందిస్తూ ప్రయాణికులకు నుంచి విశిష్ట ఆదరణ పొందుతోంది. ఇంతకూ ఆ ట్రైన్ ఏదనేగా మీ డౌట్.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Diwakar P
- Updated on: Aug 27, 2026
- 9:46 pm
సినిమాను తలపించిన రియల్ స్టోరీ.. తలకు గాయంతో గతం మర్చిపోయిన వ్యక్తి..14ఏళ్లకు అదే గాయంతో..
సాధారణంగా సినిమాల్లో తలకు గాయమై గతం మర్చిపోవడం, మళ్లీ తలకు దెబ్బతగిలి గతం గుర్తురావడం వంటి సన్నివేశాలు చూస్తుంటాం. సరిగ్గా అలాంటి అరుదైన, భావోద్వేగ సంఘటనే కామారెడ్డి జిల్లాలో ఆవిష్కృతమైంది. 14 ఏళ్ల క్రితం తప్పిపోయి, కుటుంబ సభ్యులు ఇక రాడని భావించిన ఓ కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Diwakar P
- Updated on: Aug 1, 2026
- 10:39 am
బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఆపి చెక్ చేస్తే, పెద్ద గుట్టే బయటపడింది..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో సంచలనం సృష్టించిన రూ.41 లక్షల చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. బాధితుడి సొంత మేనల్లుడే తన బాబాయ్ ఇంట్లో చోరీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. వేములవాడ దర్శనానికి వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు బంగారం, వెండి, నగదును అపహరించారు. అనంతరం అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది.
- Diwakar P
- Updated on: Jun 1, 2026
- 5:47 pm
పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రను కామారెడ్డి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వ్యాపారవేత్తతో లావాదేవిలు జరిపిన వారే అతడి వద్ద తీసుకున్న అప్పును ఎగ్గోట్టడమే కాకుండా అతడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు.
- Diwakar P
- Updated on: May 28, 2026
- 7:53 pm
5 లారీలు.. 7 కార్లు.. హైవేపై భయానక యాక్సిడెంట్.. అసలేం జరిగిందో తెలుసా..?
నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఇందల్‌వాయి మండలం చంద్రయాన్‌పల్లి సమీపంలో ఒక లారీ టైరు పంచర్ కావడంతో రోడ్డుపైనే నిలిపివేయగా, వెనుక నుంచి వచ్చిన వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. మొత్తం ఐదు లారీలు, ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొబ్బరి బొండాల లారీ పొలంలో బోల్తాపడగా, మరికొన్ని వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
- Diwakar P
- Updated on: May 26, 2026
- 11:23 am
చనిపోయాడు అనుకున్న ఇంటి పెద్ద.. 24 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి!
కొన్ని సంఘటనలు వినడానికి సినిమా కథల్లా అనిపించినా, నిజ జీవితంలో జరిగినప్పుడు అంతులేని ఆనందాన్ని, భావోద్వేగాలను కలిగిస్తాయి. చనిపోయాడని భావించి, ఆశలు వదిలేసుకున్న తమ కుటుంబ పెద్ద.. ఏకంగా పాతికేళ్ల తర్వాత కళ్ల ముందుకు వస్తే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి ఒక అద్భుతమైన మానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల సమయస్ఫూర్తి, బాధ్యతాయుతమైన కృషితో 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఒక వృద్ధుడు సురక్షితంగా తన పిల్లల చెంతకు చేరాడు. అసలేం జరిగిందంటే..
- Diwakar P
- Updated on: May 16, 2026
- 12:57 pm
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే?
కూతురి పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాలేదు.. ఇంట్లో బంధువల సందడి, చిన్నారుల కిలకిల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతలోనే ఓ వార్త అందరి ఆనందాన్ని చిదిమేసింది. బిడ్డ పెళ్లి చేసిన ఆనందం ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేక పోయింది. కన్న కూతురు పెళ్లి చేసిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Diwakar P
- Updated on: Apr 28, 2026
- 6:04 pm
Nizamabad: అమ్మ తిట్టిందని అలిగి అర్థరాత్రి సైకిల్‌పై 50 కిలోమీటర్లు వెళ్లాడు.. ఆ తర్వాత
ఇంట్లో తల్లి మందలించిందనే మనస్తాపంతో 14 ఏళ్ల బాలుడు నిజామాబాద్ నుంచి సైకిల్‌పై బయలుదేరి దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డికి అర్ధరాత్రి చేరుకున్నాడు. టేక్రియాల్ జంక్షన్ వద్ద ఆపరేషన్ కవచ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా వెళ్తున్న బాలుడిని గమనించి ఆపారు.
- Diwakar P
- Updated on: Apr 9, 2026
- 11:10 am
Telangana: జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు కురిపిస్తున్న కొత్తిమీర పంట..
Coriander Farming: కొత్తిమీరే కదా అని తీసిపారేయకండి. ఎందుకంటే ఈ చిన్నరకం పంట ఆ ప్రాంత రైతులకు బోలెడు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. కార్పొరేట్ జాబులు చేసే వాళ్లకంటే అక్కడి రైతులే ఎక్కువ సంపాధిస్తున్నారు. జస్ట్ 30 రోజుల్లోనే అక్షరాల లక్షరూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నారు. పసుపు సాగు చేసిన నేలలు కావటంతో అధిక దిగుబడితో పాటు ఇక్కడ పండించిన కొత్తిమీరకు రాష్ట్రవ్యాప్తంగా అధిక డిమాండ్ ఏర్పడుతుంది. ఇంతకు కొత్తమీరతో లక్షలు సంపాధిస్తున్న ఆ గ్రామం ఏదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
- Diwakar P
- Updated on: Apr 6, 2026
- 6:28 pm