AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు.. ఈ గ్రామం వింత ఆచారం గురించి మీకు తెలుసా?

సాధారణం గా గ్రామాల్లో దొంగతనం చేస్తూ పట్టుబడితే ఏం చేస్తారు. మొదట చితకబాది పోలీసులకు అప్పగిస్తారు. చిన్న పిల్లలు ఐతే జువెనల్ కు తరలిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం చిన్నారి దొంగలను బాజా భజంత్రీలు, మంగళ హారతులతో ఊరేగిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఇది అక్కడి ఆచారం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వారు నిజంగా దొంగలు కాదు. ఉత్తుత్తి దొంగలు. ఇంతకీ ఏంటి ఆ ఆచారం ,ఎందుకు ఆ గ్రామంలో ఈ వింత ఆచారం కొనసాగుతుందో తెలుసుకుందాం పదండి.

Watch: దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు.. ఈ గ్రామం వింత ఆచారం గురించి మీకు తెలుసా?
Nizamabad Temple Ritual
Diwakar P
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 1:32 PM

Share

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఎక్కడలేని వింత ఆచారం కొనసాగుతుంది. 1928 లో ఆలయం నిర్మించినప్పటినుండి ఈ ఆచారం అక్కడ కొనసాగుతుంది.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 98వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవంలో అందర్నీ ఆకట్టుకునే ఘట్టం ఏమిటంటే దొంగల దోపిడీ మహోత్సవం. ఈ పేరు వినగానే ఆశ్చర్యపోతున్నారు కదా. మరి అలాగే ఉంటుంది ఈ జాతర ప్రత్యేకత కూడా.

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందుగా చిన్నారులు దొంగలుగా మారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వస్తువులను, ఆభరణాలను దొంగిలించి అదే ఊరిలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్దకు వెళ్లి దాకుంటారు. ఆచారం ప్రకారం గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో వెళ్లి దొంగలను పట్టుకొని తాళ్లతో కట్టివేసి గుడికి తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.

అనంతరం స్వామి వారి వద్దకు వెళ్లి మమ్మల్ని క్షమించు స్వామి తప్పు అయిపోయింది మరొకసారి దొంగతనం చేయం అని క్షమాపణ కోరుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తారు. చిన్నారులు నిజమైన దొంగల లాగే మారడం దొంగిలించిన స్వామివారికి సొత్తును తిరిగి ఇవ్వడం స్వామివారిని వేడుకోవడం ఈ గట్టమే దొంగల దోపిడీ మహోత్సవం. అయితే ఈ తతంగం తాతల నాటి నుండి వస్తుందని పురోహితుడు తెలిపాడు.

ఈ ఆచారాన్ని కొనసాగించడం వల్ల గ్రామంలో అందరూ క్షేమంగా ఉండి. ఎవరుకూడా దొంగల బారినగాని, మరి ఎలాంటి బాధలు కలుగకుండా ఉండేందుకు దొంగల దోపిడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. చిన్నారులు చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండేందుకు గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు.

వీడియో చూడండి..

;

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌