AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Hopuses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. అప్పటికల్లా..

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలను చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. తొలి విడతలో ఇల్లు మంజూరు కాకపోవడంతో రెండో విడత కోసం అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. ఇళ్లపై ఆశలు పెట్టుకున్నారు.

Indiramma Hopuses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. అప్పటికల్లా..
Indiramma Houses
Venkatrao Lella
|

Updated on: Aug 23, 2026 | 9:20 PM

Share

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విడతల వారీగా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అందులో భాగంగా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి ఇళ్లను కేటాయించగా.. వీటిల్లో చాలా నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తి కాని నిర్మాణాలు త్వరగా పూర్తై గృహప్రవేశాలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే తొలి విడత నిర్మాణాలు కొలిక్కి రావడంతో రెండో విడతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా త్వరలో రెండో విడత ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది పేదలకు ఇళ్లను కేటాయించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు లబ్దిదారుల ఎంపికను చేపడుతున్నారు.

సెప్టెంబర్ 15 నాటికి లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాలను పక్కనపెట్టి మిగతా 100 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 2500 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 50 వేల మంది గుడిసెల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టి గుడిసెల్లో ఉంటున్నవారిని గుర్తించారు. వీరికి ఇళ్ల కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో రెండో విడత ఇళ్ల కేటాయింపుల్లో వీరికి అవకాశం కల్పించనున్నారు. లబ్దిదారుల ఎంపిక, పరిశీలన, తుది జాబితా రూకపల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండో విడత ఇళ్ల కోసం ప్రభుత్వం రూ.10,400 కోట్లు కేటాయించింది. ఇందులో 1.80 లక్షల ఇళ్ల కోసం ఒక్కొ ఇంటికి రూ.5 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇందుకు రూ.9 వేల కోట్లు ఖర్చు అవుతుంది.

అయితే స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. వీటిని నాలుగు విడతలుగా అందిస్తోంది. అయితే మహిళా సంఘాల ద్వారా ఇంటి నిర్మాణం కోసం రూ.లక్ష రుణం కూడా అందిస్తోంది. ఇక రూఫ్ పున:ప్రారంభం పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 70 వేల ఇళ్లకు ఆర్ధిక సాయం అందిస్తారు. ఒక్కొ నియోజకవర్గానికి 700 ఇళ్ల చొప్పున ఎంపిక చేసి రూ.2 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తారు. ఇంటి పైకప్పుల ఆధునీకరణ, పునర్నిర్మాణానిక వీటిని అందించనున్నారు. దీనికి సంబంధించి లబ్దిదారుల ఎంపికను కలెక్టర్లకు ప్రభుత్వం అందించింది. గ్రౌండ్ లెవల్‌లో తయారుచేసిన జాబితాను కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా ఇంచార్జ్ మంత్రి వద్దకు పంపుతారు. మంత్రి ఆమోదం తర్వాత పేర్లను ప్రకటిస్తారు. వచ్చే నెల 15లోగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.

Follow Us