AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుండెల్ని పిండేసే ఘటన.. 4 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా.. ఏం జరిగిందంటే..?

అప్పటివరకు కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ నాలుగేళ్ల చిన్నారి.. కాసేపట్లోనే విగతజీవిగా మారుతుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. సరదాగా ఇంటి ముందున్న కారెక్కిన ఆ పసిపాపకు అదే మృత్యుశకటంగా మారుతుందని ఎవరూ అనుకోలేదు. డోర్ లాక్ అయి.. కారు లోపలే ఊపిరాడక విలవిల్లాడి ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: గుండెల్ని పిండేసే ఘటన.. 4 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా.. ఏం జరిగిందంటే..?
Child Accidentally Gets Locked In Family Car
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 7:59 PM

Share

అప్పటివరకు కళ్ల ముందే ఆడుతూ పాడుతూ గడిపిన ఆ చిన్నారి.. తల్లిదండ్రుల నవ్వులతో ఇల్లంతా సందడి చేసింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న కారెక్కిన ఆ నాలుగేళ్ల చిన్నారికి అదే మృత్యుకూపంగా మారింది. డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోవడం, బయటకు రాలేక లోపలే ఊపిరాడక స్పృహ కోల్పోయి విగతజీవిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావతి నవీన్, ఐశ్వర్య దంపతులకు తన్విత శ్రీ (4), సురక్ష అనే కూతుళ్లు ఉన్నారు. తన్విత శ్రీ ఏనుకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుంది. ఆదివారం కావడంతో పాఠశాలకు సెలవు ఉండటంతో చిన్నారి ఇంట్లోనే ఉంది. ఉదయం 11 గంటల సమయంలో తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా తన్వితఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. ఇంటి ముందు నిలిపి ఉంచిన తమ కారులోకి సరదాగా ఎక్కింది. ఆ సమయంలో కారు డోరు లాక్ అయిపోవడంతో చిన్నారి లోపలే చిక్కుకుపోయింది. తీవ్రమైన వేడి, ఊపిరాడకపోవడంతో స్పృహతప్పి ముందు సీటు కింద భాగంలో పడిపోయింది.

గ్రామమంతా వెతికారు.. చివరకు కారులోనే కొద్దిసేపటి తర్వాత ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి బంధువులను, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. గ్రామంలోని సందులన్నీ గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. చివరకు అనుమానం వచ్చి ఇంటి ముందే ఆపి ఉంచిన కారు లోపల చూడగా, ముందు సీటు కింద చిన్నారి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. వెంటనే డోర్లు తెరిచి ఆమెను బయటకు తీసి, జూలూరుపాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చిన్నారి కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సర్పంచ్ ఇంట్లో జరిగిన ఈ విషాదంతో వినోబానగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us
గుండెల్ని పిండేసే ఘటన.. 4ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా..
గుండెల్ని పిండేసే ఘటన.. 4ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా..
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!