AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యతీంద్ర సప్తతి మహోత్సవాలు.. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ముచ్చింతల్‌..

Yatindra Saptati Celebrations at Muchintal: ముచ్చింతల్‌లో యతీంద్ర సప్తతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. అహోబిలం జీయర్‌స్వామి ఆధ్వర్యంలో సామూహిక సుందరకాండ పారాయణం నిర్వహించగా, హనుమంతుడికి లక్ష కొబ్బరికాయలు, వడమాలలు, అరటిపండ్లు నివేదించారు. ఈ నెల 12న శ్రీరామచంద్రుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.

యతీంద్ర సప్తతి మహోత్సవాలు.. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ముచ్చింతల్‌..
Yatindra Saptati At Muchintal
Shaik Madar Saheb
|

Updated on: Nov 09, 2026 | 12:40 PM

Share

ముచ్చింతల్‌లో యతీంద్ర సప్తతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకునన్నాయి. సోమవారం సుందరకాండ పారాయణంతో ఇవాళ్టి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అహోబిలం జీయర్‌స్వామి ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా హనుమాన్‌కి అభిషేకం నిర్వహించారు. సీతారాముల జీవితాలను సుందరం చేసిన మహనీయుడు హనుమంతుడికి లక్ష కొబ్బరికాయలు, వడమాలలు, అరటిపండ్లను నివేదించారు. భక్తిశ్రద్ధలతో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక సుందరకాండ పారాయణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సుందరకాండ శ్లోకాల పఠనం జరిగింది. శ్రీరామ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

ఉత్సవాల్లో భాగంగా జీయర్ అనుబంధ సంస్థల కార్యకలాపాల నివేదిక సమర్పణ కార్యక్రమం కూడా జరిగింది. ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్న యతీంద్ర సప్తతి మహోత్సవాల్లో ఎన్నో విశిష్ట కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఆచార్య వైభవం కార్యక్రమం ఉంటుంది.

రేపు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర మంగళ తరంగిణి నిర్వహిస్తారు. ఈనెల 11న దేశ సేవలో విశేష త్యాగాలు చేసిన 70 మందికి సమతా పురస్కారాలు… సమాజ సేవకు అంకితమైన 70 మంది మాతృమూర్తులకు సన్మానం కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజున, అంటే ఈనెల 12న శ్రీరామచంద్రుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.

Follow Us