Telangana: కొత్త పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఈ నెల నుంచే డబ్బులు.. ఆన్‌లైన్‌లో మీ స్టేటస్ చెక్ చేసుకోండిలా..
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల నుంచే కొత్త పించన్లను మంజూరు చేస్తోంది. ఈ నెల నుంచి లబ్దిదారులకు నగదు అందిస్తోంది. అయితే తమకు నగదు అందుతుందా.. లేదా అనేది లబ్దిదారులు సులువుగా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. చేయూత పించన్ స్టేటస్ ఇలా చెక్ చేస్కోండి..

తెలంగాణలో కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ అందింది. రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎప్పుడెప్పుడు నగదు అందుతాయా అని నిరీక్షిస్తున్నవారికి ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఎట్టకేలకు ఎంతోకాలంగా నిరీక్షణ తర్వాత కొత్త పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఐదున్నర లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన అనంతరం అర్హులను గుర్తించారు. దాదాపు 4.50 లక్షల మంది చేయూత పథకం ద్వారా వివిధ కేటగిరీల కింద సామాజిక పింఛన్లు పొందేందుకు అర్హత సాధించినట్లు గుర్తించింది. వారికి ఈ నెల నుంచే పింఛన్లను పంపిణీకి సిద్దమైంది. అర్హులైనవారికి పింఛన్ల మంజూరు పత్రాలు జారీ చేయడంతో పాటు నవంబర్ నెల నుంచి డబ్బులు అందించనున్నారు.
కొత్తగా పింఛన్లకు అర్హత సాధించిన 4.50 లక్షల మందిలో వితంతువుల కేటగిరీ కింద 3 లక్షల మంది, దివ్యాంగులు లక్ష మంది, నేత గీత కార్మికులు 50 వేల మంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కొత్త పింఛన్లను జారీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ నుంచి కొత్త దరఖాస్తులు ఆహ్వానించారు. అనంతరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. దరఖాస్తుదారుల ప్రతీ ఇంటికి వెళ్లి నిజమైన అర్హులో కాదో పరిశీలన చేపట్టింది. అనంతరం అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితా సిద్దం చేసింది. ఈ జాబితాకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. కొత్త పింఛన్లు మంజూరైనట్లయింది. దసరా నుంచే కొత్త పింఛన్లను అందిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ కొంత జాప్యం జరగడం వల్ల వాయిదా పడింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..?
-తెలంగాణ చేయూత పథకం వెబ్ సైట్ సందర్శించాలి
-పెన్షన్ ఐడీ,UID/SADAREM ID నమోదు చేయాలి
-మీ దగ్గర ఐడీ వివరాలు అందుబాటులో లేకపోతే జిల్లా, మండలం, పంచాయతీ, పెన్షనర్ పేరు, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ వివరాలు నమోదు చేయాలి
-ఆ తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి
-అనంతరం స్క్రీన్‌పై మీ పింఛన్ స్టేటస్ కనిపిస్తుంది
-మీకు పెన్షన్ డబ్బులు జమ అయ్యాయా.. లేదా అనేది తెలుస్తుంది.
దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..?
మీరు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని దాని స్టేటస్ కూడా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు
-ముందుగా చేయూత పోర్టల్‌లోకి వెళ్లాలి
-అప్లికేషన్ ఐడీ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
-మీ జిల్లా, మండలం, గ్రామం లేదా వార్డ్ వివరాలు నమోదు చేయాలి
-అనంతరం సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
-అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు
