AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన పేరెంట్స్..

ఖమ్మం జిల్లాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. కుమారుడు కారు దిగిన విషయం మర్చిపోయిన పేరెంట్స్.. అతన్ని ఎక్కించుకోకుండానే వెల్లిపోయారు. అయితే తప్పిపోయి రోడ్డుపై ఉన్న బాలుడని గుర్తించిన స్థానిక యువకులు, పోలీసుల సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

Viral Video: చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన పేరెంట్స్..
Khammam Child Rescue
Anand T
|

Updated on: Aug 23, 2026 | 9:46 PM

Share

పిల్లాడు కారు దిగిన విషయాన్ని గమనించకుండా తల్లిదండ్రులు ముందుకు వెళ్లిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌ గనీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో గుంటూరు వెళ్తుండగా, ఖమ్మం జిల్లా గౌరారం టోల్‌ప్లాజా సమీపంలో వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేయడానికి కారును ఆపారు. ఆ సమయంలో కారులో ఉన్న కుమారుడు అమాన్‌, ఎవరికీ చెప్పకుండా కిందకు దిగి పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లాడు. అయితే, బాలుడు కారు దిగిన విషయాన్ని గమనించని గనీ కుటుంబం అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారులో అమాన్‌ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పుకుని అదే మార్గంలో టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే రోడ్డుపై ఒంటరిగా ఉన్న బాలుడిని గమనించిన కొందరు యువకులు, బాబును వీఎం బంజర్‌ పోలీస్‌స్టేషన్‌లో తీసుకెళ్లి అప్పగించారు. దీంతో బాలుడి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు తల్లిదండ్రుల సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కుమారుడు అమాన్‌ను క్షేమంగా తమ వెంట తీసుకెళ్లారు. తమ బిడ్డను అప్పగించడంలో సహకరించిన యువకులకు, పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పిల్లల్ని వాహానాల్లో తీసుకెళ్లేప్పుడు ఎక్కడైనా ఆపితే మళ్లీ ఎక్కారా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. పిల్లల పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us