AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో దాగి ఉన్న 3 గుడ్లగూబలను గుర్తిస్తే నువ్వే తోపు!

సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు మనకు కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాకుండా, మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కూడా కలిగిస్తాయి. వీటిని పరిష్కరించినప్పుడు వచ్చే ఆనందం మన దగ్గరే ఆగిపోకుండా ఉండాలంటే, వీటిని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా పంపి వారు దీన్ని పరిష్కరించగలరో లేదో చూడండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో దాగి ఉన్న 3 గుడ్లగూబలను గుర్తిస్తే నువ్వే తోపు!
Optical Illusion
Anand T
|

Updated on: Aug 21, 2026 | 11:17 AM

Share

సోషల్ మీడియాలో రోజూ కొన్ని వందల, వేల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే మనకు సవాళ్లు విసిరేలా ఉంటాయి. అలాంటి వాటిని చూసినప్పుడు కచ్చితంగా ఎలాగైనా దాన్ని సాల్వ్ చేయాలనిపిస్తుంది. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు ఒకటి. ఇవి చూడ్డానికి చాలా సింపుల్‌గా కనిపించినా, ఒక్కసారి బరిలోకి దిగితే మాత్రం మన బ్రెయిన్‌ను తలకిందులు చేస్తాయి. వాటిని సాల్వ్ చేసేందుకు మనం పెట్టే ఎఫర్ట్స్ మనల్ని యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా, మన ఆలోచనా శక్తిని పెంచుతాయి.

ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఏమిటి?

ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు కేవలం మన కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పడమే కాకుండా మన తెలివితేటలను కూడా పెంచుతాయి. మన కళ్లకు కనిపించే ప్రతి అంశాన్ని మెదడు క్లియర్‌గా గుర్తించి, అక్కడున్న పొరపాట్లను విశ్లేషిస్తుంది. దీని ఆధారంగానే ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలను రూపొందిస్తారు. కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా గమనించి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మన మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. తద్వారా మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది, భవిష్యత్తులో మీకు ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీరు కూడా ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలనుకుంటే, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

వైరల్ చిత్రంలో ఏముంది?

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు తమ పెంపుడు జంతువులు, పక్షులను పట్టుకొని నిల్చుని ఉన్నారు. వాటిలో కొందరి చేతుల్లో పిల్లులు, మరికొందరి చేతుల్లో ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. అంతేకాదు, కొందరి చేతుల్లో గుడ్లగూబలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. కేవలం 10 సెకన్లలో ఆ వ్యక్తుల చేతుల్లో ఉన్న గుడ్లగూబలను మీరు కనిపెట్టాలి. మీరు ఈ సవాలుకు సిద్ధంగా ఉంటే, మీ సమయం మొదలైంది!

సమాధానం ఇక్కడ ఉంది

మీకు ఇచ్చిన 10 సెకన్లలో అక్కడ ఉన్న గుడ్లగూబలను కనిపెట్టి ఉంటే అభినందనలు! మీ కళ్లు చాలా షార్ప్‌గా పనిచేస్తున్నాయని అర్థం. ఒకవేళ మీరు సమాధానం కనిపెట్టలేకపోయినా పర్లేదు, మీకోసం మేము సహాయం చేస్తాం. క్రింద ఇచ్చిన చిత్రంలో దాగి ఉన్న గుడ్లగూబలను గుర్తించి చూపించాం, అక్కడ మీరు సమాధానాన్ని చూడవచ్చు.

Optical Illusion Hidden Puzzle

Optical Illusion Hidden Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us