AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: అరెరే ఈ సీక్రెట్ ఇన్నాళ్లు తెలీదే.. దోసె పిండి త్వరగా పులియపెట్టడం ఇంత సింపులా!

మన సౌతిండియాలో అందరికి నచ్చిన ఇష్టమైన బ్రేక్‌ ఫాస్ట్ ఏవైనా ఉన్నాయంటే అవి, ఇడ్లీ, దోశ.. అయితే వీటిని చేయాలంటే రాత్రి నానబెట్టి, పిండి రుబ్బి దాన్ని పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఈ పెద్ద ప్రాసెస్ ఫాలో అవ్వడం చాలా మందికి కుదరదు కాబట్టి తక్కవు టైంలో దోశ పిండిని పులియపెట్టడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి కోసమే ఒక మంచి చిట్కాను తీసుకొచ్చాం. ఈ చిట్కాను ఫాలో అయితే కొద్ది సేపట్లోనే మీరు దోసల పిండిని రెడీ చేయవచ్చు.

Kitchen Tips: అరెరే ఈ సీక్రెట్ ఇన్నాళ్లు తెలీదే.. దోసె పిండి త్వరగా పులియపెట్టడం ఇంత సింపులా!
How To Ferment Idli Dosa Batter Fast
Anand T
|

Updated on: Aug 22, 2026 | 12:36 PM

Share

సాధారణంగా మనం దోసల పిండిని తయారు చేయడానికి ముందుగా బియ్యం నానబెట్టి.. వాటిని రుబ్బి 6-7 గంటల పాటు పులియపెడతాం. కానీ మీకు సడెన్‌గా ఆఫీస్ టైం అయితే త్వరగా టిఫిక్ కావాలి అనుకుంటే ఇకపై అన్ని గంటలు వెయిట్ చేయాల్సిన పనిలేదు. మీరు రుబ్బుకున్న దోసెల పిండితోనే కొన్ని చిట్కాలు పాటించి త్వరగా పులిసేలా చేయవచ్చు. నిజానికి సహజంగా పులియపెట్టిన పిండే ఆరోగ్యానికి, టేస్ట్‌కు మంచిది అయినప్పటికే ఎప్పడైనా అర్జెంట్‌గా కావాల్సినప్పుడు మాత్రం మీకు ఈ చిట్కాలు ఉపయోగపడుతాయి.

దోశ పిండి త్వరగా పులియపెట్టే చిట్కాలు

వేడి వాతవరణం: దోస పిండి త్వరగా మంచిగా పులయాలంటే కాస్త వాతావరణం అవసరం. కాబట్టి మీరు రుబ్బి పెట్టుకున్న బియ్యపు పిండిని ఒక పాత్రలో వేసి ఆ పాత్రను గ్యాస్ స్టవ్ పక్కన లేదా మైక్రోవేవ్, ఓవెన్ లోపల కొద్దిసేపు ఉంచండి. ఓవెన్‌ను ఆన్‌ చేయాల్సిన పనిలేదు దాన్ని అలాగే ఉంచినా సరిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే పిండి పులుస్తుంది. తర్వాత మీరు దానితో దోసెలు వేసుకోవచ్చు.

ప్రెజర్ కుక్కర్ ట్రిక్: ఇలా కూడా మీరు పిండిని త్వరగా పులిసేలా చేయవచ్చు. ఇందుకోసం మొదటిగా మీరు రుబ్బిపెట్టుకున్న దోస పిండిలో కొద్దిగా ఉప్పు కలిపి స్టీల్ పాత్రలో ఉంచండి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌ను కాసేపు వేడి చేసి, స్టవ్ ఆపివేయండి. ఆ తర్వాత పిండి గిన్నెను కుక్కర్‌లో పెట్టి మూత పెడితే లోపలి వేడిమికి పిండి వేగంగా ఫర్మెంట్ అవుతుంది.

అయితే పిండిని నిల్వ చేయడానికి మీరు సరైన పాత్రలు ఎంచుకోవాల్సి ఉంటుంది. పిండి త్వరగా పులియడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా మట్టి పాత్రలు వాడితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇవి సరైన ఉష్ణోగ్రతను ఎక్కవ సేపు నిలిపి ఉంచడంలో బాగా పనిచేస్తాయి,.

పెరుగు, చక్కెర మిక్సింగ్: పిండి త్వరగా పులియడానికి ఉన్న మరో పద్దతి ఏమిటంటే.. మీరు రుబ్బి పెట్టుకున్న పిండిలో కొద్దిగా పెరుగు, చిటికెడు చక్కెర కలపండి. కొందరు కొద్దిగా నిమ్మరసం లేదా రాతి ఉప్పు కూడా కలుపుతారు. ఆ తర్వాత పిండిని మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా పిండి త్వరగా పులుస్తుంది. తద్వారా మీరు దోసేలు వేసుకోవడానికి గంటలు తరబడి వెయిట్ చేసే పని ఉండదు.

గమనిక: ఈ చిట్కాలను మీ టైం లేదు.. అర్జెంట్ అన్నప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. దోశలు మంచి రుచిగా, సరైన ఆకృతితో, జీర్ణక్రియకు అనుకూలంగా ఉండాలంటే పిండిని సహజ పద్ధతిలో 6 నుండి 8 గంటల పాటు పులవనివ్వడమే ఉత్తమం. కాబట్టి వీలైనంత వరకు పిండిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us