AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్ Vs అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ ప్రయాణానికి ఏది బెస్ట్?

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో మౌలిక సదుపాయాలను హైస్పీడ్‌లో అప్‌డ్రేట్ చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్ర సర్కార్ కీలక మార్పులు తీసుకొచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు హైస్పీడ్ ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో వందేభారత్, అమృత్‌ భారత్‌ అనే రెండు ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. ఈ రెండు రీసెంట్‌గా వచ్చిన ట్రైన్సే అయినా.. వీటిని మధ్య తేడా ఏమిటి.. మీకు అవసరాల దృష్యా మీ ప్రయాణానికి ఏ ట్రైన్ మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 22, 2026 | 11:58 AM

Share
వందే భారత్: హై-స్పీడ్, లగ్జరీ ప్రయాణం కోరుకునే ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన ట్రైన్ ఇది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత దేశంలో తయారైన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌తో కాకుండా ఇంటిగ్రేటెడ్ సెమీ హై-స్పీడ్ ట్రైన్‌సెట్‌ అనే సాంకేతికతతో నడుస్తోంది. అంటే డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్‌ ఈ ట్రైన్‌ వేగంగా నడిచేందుకు పికప్‌ను అందిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కవ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ ట్రైన్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

1 / 5
ఈ వందే భారత్‌లో ట్రైన్ అనేది హైటెక్ ప్రయాణ సదుపాయాలను కలిగి ఉంటుంది. ఈ ట్రైన్‌ పూర్తిగా ఏసీ కోచ్‌లతో నిండి ఉంటుంది. అంతేకాదు ఇందులో మొత్తం ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, సౌకర్యవంతమైన రొటేటింగ్ సీట్లు ఉంటాయి. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు బయో-వాక్యూమ్ టాయిలెట్లు, భద్రతకోసం కవచ్ సేఫ్టీ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రయాణికులకు ప్రీమియం అనుభవంతో పాటు వేగంవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. వేగం, సౌకర్యాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది.

2 / 5
అమృత్ భారత్: సామాన్యులకు కూడా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ట్రైనే ఈ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్.. సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కవ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలంటే కేవలం రైలు మాత్రమే అనువైనది. అయితే సామాన్యులకు కూడా సూపర్ ఫాస్ట్ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్ రూపొందించబడింది. ముందు-వెనుక రెండు ఇంజిన్లతో కూడిన పుష్-పుల్ సాంకేతికతతో నడిచే ఈ ట్రైన్ 110-130 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

3 / 5
మాకు ఏసీ అవసరం లేదు కాస్త తక్కవ ఖర్చుతో సేఫ్టీ కూడా కావాలి అనుకునే ప్రయాణికులు ఈ ట్రైన్ ఫర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ అమృత్ భారత్‌ ట్రైన్‌లో రెండు కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఒకటి స్లీపర్, మరోకటి జనరల్ నాన్-ఏసీ. అయినప్పటికీ ఈ కోచ్‌లలో ఆధునిక కుషన్ సీట్లు, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్, సీల్డ్ గ్యాంగ్‌వేస్ ఉంటాయి. అంతేకాదు జెర్క్స్ లేకుండా సాఫీగా ప్రయాణించడానికి సెమీ-ఆటోమేటిక్ కప్లర్లు, క్రాష్ ట్యూబ్స్, సీసీటీవీ భద్రత కూడా ఈ ట్రైన్‌లో ఉంటుంది. .

4 / 5
మీ ప్రయాణానికి ఏ రైలు సరైనది?: అయితే ఈ రెండు ట్రైన్‌లలో అత్యాధునిక ఫీచర్లు, సేఫ్టీ పరంగా పెద్ద తేడాలు లేకపోయినా బడ్జెట్‌, వేగంలో మాత్రం మార్పులు ఉంటాయి. ఒక వేళ మీరు తక్కువ బడ్జెట్‌లో దూర ప్రయాణం చేయాలనుకుంటే మీరు అమృత్ భారత్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అదే సమయంలో ప్రీమియం ధరతో తక్కువ సమయంలో విలాసవంతమైన ఇంటర్-సిటీ ప్రయాణం చేయాలనుకుంటే మీకు వందే భారత్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

5 / 5
Follow Us