AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..

రైతు పండించే కొన్ని పంటలు వారికి విపరీతంగా కలిసి వస్తాయి, మరి కొన్ని పంటలు మధ్యలోనే పోతాయి. అయితే, అన్నింటి కంటే ఈ పంట వెయ్యి రెట్లు బెటర్. మీరు ఈ పంటకు జస్ట్ రూ. 3 వేలు పెడితే ఎకరాకు లక్ష వరకు ఆదాయం వస్తుంది. అయితే, ఇదేలా పండించాలో ఇక్కడ చూడండి..

జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 5:10 PM

Share

రైతు పండించే అన్ని పంటలు వారికీ కలిసి రావు. అయితే, కొన్ని మాత్రం పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తాయి. అధిక లాభాలు వచ్చేలా చేస్తాయి. జనుము పంట గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే, దీనికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మూడు వేలు పెట్టి కేజీ విత్తనాలు కొంటే మీకు ఎకరాకు రూ. 80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుంది.

ఈ పంటను ఎలా పండించాలంటే?

వరి పంటను పండించే సమయంలోనే దీని విత్తనాలను వేసుకోవాలి. అంటే ఖరీఫ్‌ పంటల సమయంలో సీడ్స్ ను వేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత వేసుకుంటే దిగుబడి రాదు. వరి పంటను కోసిన తర్వాత , 10 రోజుల తర్వాత జనుము సీడ్స్ మొలకెత్తుతాయి. మన దగ్గర ముందే వీటి విత్తనాలు ఉంటే ఒక్క రూపాయి కూడా వీటికి పెట్టాల్సిన అవసరం లేదు. రైతులకు కాసులు వర్షం కురుస్తుంది. ఈ పంటను వేసిన రైతులు ఎక్కడా కూడా నష్ట పోలేదు.

కొన్ని చోట్ల రైతులు ఖరీఫ్‌ పంట వేసిన తర్వాత ఈ జనుము పంటను సాగు చేస్తారు. ఇక ఇప్పుడు ఇది కొన్ని ప్రదేశాల్లో పూతదశలో ఉంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా మందుల అవసరం కూడా లేకుండా ఇది మంచిగా పండుతుంది. మీరు విత్తనాల కోసం రూ. 3 వేలు పెడితే పంట రేట్ ను బట్టి ఎకరాకు లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఇప్పుడు మార్కెట్లో కిలో జనుము రూ. 60 నుండి రూ.100 వరకు అమ్ముతున్నారు. మినప, కంది సాగు కన్నా కూడా జనుము సాగు చాలా మంచిది. మినప, మిరప మొక్కలు పూతలోనే దెబ్బతింటాయి. దీనికి అలాంటి బాధలు ఏం ఉండవు. ఈ జనుము పంటకు తెగులు కూడా రాదు. అన్ని పంటల కంటే జనుము పంటకి అధిక లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర