AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith: అక్కడ అజిత్ కావాలనే అలా చేస్తున్నారా..?

Ajith: అక్కడ అజిత్ కావాలనే అలా చేస్తున్నారా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 9:57 PM

Share

విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తమిళ సినీ పరిశ్రమలో అగ్రస్థానం కోసం అజిత్ పేరు బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ ఆయన స్టార్ దర్శకుల కంటే కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తుండటం అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తన స్టైల్‌ను మరోసారి నిరూపించిన అజిత్, బలమైన కథతో వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తమిళ ఇండస్ట్రీలో అజిత్‌కు నెంబర్ వన్ పీఠం మీద ఇంట్రెస్ట్ లేదా..? విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కావాలనుకుంటే అజిత్ ఈజీగా ఆ చైర్ మీద కూర్చోవచ్చు కానీ కావాలనే ఆ కుర్చీకి దూరం జరుగుతున్నారా..? స్టార్ డైరెక్టర్స్‌తో పని చేయకుండా అజిత్‌ను అడ్డుకుంటున్నదెవరు..? కొన్నేళ్లుగా అప్‌కమింగ్ దర్శకులతోనే సినిమాలెందుకు చేస్తున్నారు..? అసలేం జరుగుతుంది..? తమిళ ఇండస్ట్రీలో అజిత్ కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సూపర్ స్టార్‌కు కావాల్సిన ఆరా, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, తిరుగులేని చరిష్మా అన్నీ ఆయన సొంతం. కానీ ఆయన ఎంచుకుంటున్న సాధారణ కథలు, దర్శకుల వల్లే అజిత్‌లోని అసలైన స్టామినా బయటకు రావడం లేదని ఫ్యాన్స్ చాలా కాలంగా ఫీల్ అవుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తమళనాట టాప్ చైర్ ఖాళీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ ఓ టాప్ డైరెక్టర్‌తో బలమైన కథతో సినిమా చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర అది రికార్డ్స్ సృష్టించడం ఖాయం. అజిత్‌కు ఉన్న ఇమేజ్‌కు ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి ఈ అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా అది జరగట్లేదు. నటుడిగా అజిత్ ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తున్నా.. ఆ టాలెంట్‌ను వాడుకునే సరైన సినిమానే ఈ మధ్య పడలేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే అజిత్ వింటేజ్ స్టైల్ ఏంటో చూపించింది. ఏదో ఓరోజు సరైన దర్శకుడు తగిలితే అజిత్ విశ్వరూపం ఏంటో చూస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి అగ్ర పీఠం అడుగు దూరంలోనే ఉన్నా.. అజిత్ మాత్రం ఆ కుర్చీ మీద ఆసక్తి చూపించట్లేదనేది కాదనలేని వాస్తవం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

Follow Us