EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు..
ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు వేగంగా పొందలంటే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈపీఎఫ్ఓకు అనుసంధానం చేసుకోవాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఈ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం రండి.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డేట్ బేస్ ఏకీకరణ చేపట్టడంతో పాటు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇక నుంచి అత్యంత వేగంగా పీఎఫ్ డిజిటల్ సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్స్, వివరాలు అప్డేట్, కేవైసీ అప్డేట్, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, పెన్షన్ విత్ డ్రా వంటివి అత్యంత వేగంగా ప్రాసెస్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఇక నుంచి వీటి కోసం ఖాతాదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక నుంచి ఆన్‌లైన్‌లో అత్యంత వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. అయితే ఇందుకు ఒక కండీషన్ ఉంది. అదేంటంటే.. వేగంగా ఆన్‌లైన్ సేవలు పొందాలంటే ఖాతాదారుడు తప్పనిసరిగా KYC వివరాలను EPFOలో అప్‌డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
ఎందుకు అప్డేట్ చేసుకోవాలి..?
ఈపీఎఫ్ఓలో కేవైసీ అప్డేట్ చేసుకోవడం అనేది తప్పనిసరి. లేకపోతే పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవడం, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం లేదా ఈ-నామినేషన్‌ను పూర్తి చేయడం వంటి సేవలు పొందలేరు. యూఏఎన్ పోర్టల్ ద్వారా సులువుగా KYC వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కొంత సమాచారం యాక్టివ్ అవ్వడానికి ముందు యజమానులు, బ్యాంకుల ద్వారా ధృవీకరణ అవసరం. లావాదేవీలు జరగడానికి ముందు సభ్యుల గుర్తింపును ధృవీకరించడంలో EPFOకు KYC వివరాలు సహాయపడతాయి. కేవైసీలో భాగంగా ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ లాంటివి అప్డేట్ చేసుకోవాలి. దీని వల్ల మీరు పీఎఫ్, పెన్షన్ విత్ డ్రా వంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయొచ్చు.
కేవైసీ పూర్తి చేయడం ఎలా..?
-యూఏఎన్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి
– “మేనేజ్” విభాగానికి వెళ్లి KYC ఆప్షన్ ఎంచుకోండి
-మీరు ఏ వివరాలు అయితే అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోండి
-ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లలో ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి
– అవసరమైన వివరాలను నమోదు చేయండి
– బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేస్తుంటే.. ఖాతా నంబర్, IFSC కోడ్‌ను టైప్ చేసి బ్రాంచ్ సమాచారాన్ని ధృవీకరించుకోండి
– డిక్లరేషన్‌ను ఆమోదించి సమాచారాన్ని సేవ్ చేసుకోండి
-మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయండి
